Hyderabad:గుడ్ న్యూస్.. ఇక నుంచి 24 గంటలు బస్సులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో చాలామంది ఆఫీస్ లకు, స్కూల్స్, కాలేజ్, ఇతరత్రా పనుల నిమిత్తం వెళ్ళేవాళ్ళు ఎక్కువగా బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు వెళ్లిన పని ఆలస్యమైతే బస్సులు ఉండవని కంగారు పడుతుంటారు. అయితే ఇక నుంచి కంగారు పడాల్సిన అవసరం లేదని టీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఉన్న రూట్లలో అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.
ఈ బస్సులు డిపోలకు చేరుకొనే సమయానికి రెగ్యులర్ బస్సులు తిరిగి రోడ్డెక్కుతాయి. దీంతో 24 నాలుగు గంటల పాటు ప్రయాణికులు ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే పలు మార్గాల్లో నైట్‌బస్సులు ప్రయోగాత్మకంగా నడుపుతున్న ఆర్టీసీ.. ప్రయాణికుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోందని వెల్లడించింది.
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆలస్యంగా నగరానికి చేరుకొనే ప్రయాణికులు, తెల్లవారు జామునే దూరప్రాంతాలకు బయలుదేరేవారికి ఈ బస్సులు అనుకూలంగా ఉన్నాయి. అర్ధరాత్రి నగరానికి చేరుకొనే ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌లలో వెళ్లేందుకు పెద్ద మొత్తంలో చెల్లించవలసి వస్తోంది.
మరోవైపు ప్రయాణికుల భద్రతకూడా ప్రశ్నార్ధకమే. ఈ నేపథ్యంలో తాము ప్రవేశపెట్టిన సిటీ బస్సులకు ప్రయాణికుల ఆదరణ లభిస్తోందని, డిమాండ్ మేరకు నగరంలోని మరిన్ని మార్గాల్లో బస్సులను ప్రవేశపెడుతామని ఆర్టీసీ సికింద్రాబాద్ రీజనల్‌మేనేజర్ వెంకన్న వెల్లడించారు.
Delhi Fire Accident: ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 27 మంది మృతి.. 29 మంది మిస్సింగ్
తాజావార్తలు
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!