ప్రయాణికుల అవసరం.. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల అవకాశం.. వెరశి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొమురం భీం జిల్లాలో ప్రైవేటు ట్రావెల్ బస్సు యాజమాన్యం మోసం బయటపడింది. పరిమితికి మించి ప్రయాణికులను బస్సు లో ఎక్కించడం తో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు వాంకిడి చెక్ పోస్ట్ వద్ద బస్సును రవాణా శాఖ అధికారులు పట్టుకున్నారు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి యూపీ, బీహార్ వెళ్లేందుకు ఒక ప్రైవేటుట్రావెల్స్ ద్వారా వెళుతున్న ప్రయాణికులు టికెట్ ధర…
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పలు జిల్లాల్లో సోమవారం తెల్లవారుజామున వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియడంతో పాటు పలు చోట్లు పిడుగులు పడ్డాయి. భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ అకాల వర్షం రైతులను తీవ్ర నిరాశ పరిచింది. నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం…
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యొగుల పాలిట బంగారు హస్తం అయ్యింది. గత ఏడాది కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితుల ఎదురైన సంగతి తెలిసిందే..ఇప్పుడీప్పుడే రాష్ట్రం మళ్ళీ ఆర్థికంగా పుంజుకుంటున్న సంగతి తెలిసిందే..ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రవేట్ సంస్థలలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్. ఇప్పటికే ప్రముఖ కంపెనీలలో ఉన్న పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది..కొన్ని పోస్టులకు సంబంధించిన ఉద్యొగాలు భర్థీ అయ్యాయి. ఇప్పుడు మరో నోటిఫికేషన్…
https://www.youtube.com/watch?v=eOAEUkF05dc సోమవారం ఏ రాశివారు ఏం చేయాలి? ఏ కార్యక్రమాలు చేస్తే ఫలితాలు ఎలా వుంటాయి. ద్వాదశ రాశులకు సంబంధించి గ్రహచారం, మంచీచెడు గురించి శ్రీరాయప్రోలు మల్లిఖార్జున శర్మ రాశిఫలాలు అందిస్తారు. ఆ రాశిఫలాలు ఎలా వున్నాయో ఈ వీడియోలో చూద్దాం.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. మెదక్ జిల్లా తుఫ్రాన్ మున్సిపల్ ఆఫీస్ లో హరీష్ రావు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. బిజెపి అంటే భారతీయ జూటా పార్టీ అని విమర్శించారు. అమిత్ షా చెప్పిన అబద్ధాలపై స్థానిక బీజేపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే తాను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. అమిత్ షా కాదు అబద్ధాల బాద్ షా అని…
కిచెన్లో ఉల్లిపాయలు, టమోటా లేకుంటే రోజు గడవదు. ఉల్లిపాయలు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. కిలో 20 రూపాయల లోపే లభిస్తున్నాయి. ఇక నిత్యం కూరల్లో వాడే టమోటా ధర మాత్రం ఆకాశానికి చేరింది. అక్కడినించి దిగనంటోంది. తిరుపతిలో మరింతగా పెరిగింది టమోటా ధర. మదనపల్లె మార్కెట్లో రూ.70కి చేరింది కేజీ టమోటా ధర. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా వినియోగదారులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు టమోటాల వినియోగం ఎక్కువగా వుంటుంది.…
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో స్వామి వారి జయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఉదయం మూల మాస్త్ర హావనములు, పూర్ణాహుతి, సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించి, సాయంత్రం నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావంతో జయంతి ఉత్సవాలు ముగుస్తాయి. రేపటి నుండి సుదర్శన నరసింహ హోమం, నిత్యా, శాశ్వత కళ్యాణం, నిత్యా, శాశ్వత బ్రహ్మోత్సవం పునఃప్రారంభం కానున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. కాగా.. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో రెండు రోజులుగా కన్నుల పండువగా జయంత్యుత్సవాలు…
తెలంగాణలో హోంమంత్రి అమిత్ షా పర్యటన విజయవంతం అయిందని బీజేపీ నేతలు చంకలు గుద్దుకుంటుంటే..విపక్షాలు మాత్రం విరుచుకుపడుతున్నాయి. అమిత్ షా హైదరాబాద్ రాజకీయ పర్యటనపై మండిపడ్డారు సీపీఐ నేత నారాయణ. వొక్కసారి గెలిపించండి ప్లీజ్ అంటూ వీరోచితంగా పర్యటన సాగించి అమిత్ షాను ఆహ్వానించి అట్టహాసంగా బహిరంగసభ పెట్టి దీనంగా “వొక్కసారి ” అంటే వురి వొక్కసారే వేశారంటే చాలు రెండోసారికి అవకాశం వుండదు అన్నట్టుగా నారాయణ తనదైన రీతిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీని తెలంగాణాలో ఒక్కసారి…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ పర్యటనపై.. ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ టీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు సెటైర్ వేసిన విషయం తెలిసిందే. అయితే.. దానికి ప్రతిస్పందించిన బీజేపీ తెలంగాణ శాఖ నరసింహ జయంతిని ప్రస్తావిస్తూ హరీశ్ రావుకు కౌంటర్ వేసింది. హిరణ్యకశిపుడిని…