సివిల్స్ 2021 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం ఉదయం విడుదల చేసింది. ఈ సందర్భంగా మొత్తం 685 మంది సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. వీరిలో ఐఏఎస్‌కు 180, ఐఎఫ్ఎస్కు 37, ఐపీఎస్‌కు 200 మంది ఎంపికయ్యారు. శృతి శర్మ ఆలిండియా నంబర్‌వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. అంకిత అగర్వాల్ రెండో ర్యాంక్, గామిని సింగ్మా మూడో ర్యాంక్ సాధించారు. పూర్తి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Technology: కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేస్తున్నారా?…
తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన మొత్తానికి విజయవంతంగా ముగిసింది. ఈనెల 18న లండన్ వెళ్లిన ఆయన అక్కడి ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. తరువాత స్విట్జర్లాండ్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 45 కంపెనీల బృందాలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణలోని పెట్టుబడి అవకాశాల గురించి క్లుప్తంగా వివరించి అభివృద్ధి పథంలో ముందున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. దీంతో ప్రముఖ కంపెనీలు…
మరికొన్ని రోజుల్లో ఆ యువకుడికి పెళ్ళి.. కుటుంబీకులందరూ ఆ పనుల్లో బిజీగా ఉన్నారు.. అంగరంగ వైభవంగా పెళ్ళి నిర్వహించాలని రంగం సిద్ధం చేస్తున్నారు.. కానీ ఇంతలో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహేతర సంబంధం ఆ యువకుడ్ని బలి తీసుకుంది. పెళ్ళి పీటలు ఎక్కాల్సిన తమ అబ్బాయి.. పాడె ఎక్కాల్సి వచ్చిందంటూ కుటుంబీకులు భోరమంటూ విలపిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. అల్లిపురానికి చెందిన గట్ల నవీన్ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ళ క్రితం…
సాధారణంగా బతికి వున్న వారి పేరుమీద మాత్రమే ఇళ్ళు, స్థలాలు, వాహనాలు రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ డబ్బులిచ్చవారుంటే చనిపోయినవారి పేరు మీద కూడా చక్కగా రిజిస్ట్రేషన్ చేసేవారున్నారంటే మీరు నమ్ముతారా? ఇచ్చట ఆత్మలకు ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయబడును.! అవును మీరు వింటున్నది నిజమే..! చనిపోయిన వారి పేరుపై కూడా చేసేస్తారు? నమ్మడం లేదా? సరే ఒక్కసారి కరీంనగర్ వెళ్లొద్దాం రండి. కరీంనగర్‌లోని సవరన్ స్ట్రీట్ లో 2 గుంటల స్థలంలో ఇల్లు కటకం చంద్రయ్య పేరున ఉంది.…
కరోనా కేసులు తగ్గాయని ఊపిరి పీల్చుకుంటే వేరియంట్ల మీద వేరియంట్లు పుట్టుకొచ్చి భయపెడుతున్నాయి. దేశంలో తాజాగా రెండు కొత్త వేరియంట్లకు సంబంధించి కేసులు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా ఉద్ధృతి దేశంలో కాస్త తగ్గింది. కేసులు కూడా గతంతో పోలిస్తే బాగా తగ్గాయ్. అయితే ఒమిక్రాన్‌కు సంబంధించిన వేరియంట్లు ఒక్కొక్కటిగా బయటకు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని పూణేలో బీఏ4, బీఏ5 కరోనా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వీరందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు.…
★ అమరావతి: వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నేటితో మూడేళ్లు పూర్తయిన సందర్భంగా తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో సంబరాలు.. పాల్గొననున్న సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ★ నేడు ఆత్మకూరు ఉపఎన్నికకు నోటిఫికేషన్.. నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ.. జూన్ 6వ వరకు నామినేషన్‌కు చివరి గడువు.. జూన్ 23న పోలింగ్.. 26న ఫలితాలు ★ శ్రీకాకుళం: నేడు ఆముదాలవలస రైల్వేస్టేషన్లో న్యూ పుట్‌పాత్ బ్రిడ్డి ప్రారంభోత్సవం చేయనున్న స్పీకర్ తమ్మినేని సీతారాం ★ విశాఖ: నేడు…
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లో నిర్వహించిన రెడ్ల సింహగర్జన బహిరంగ సభలో మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే! తొలుత ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొందరు వ్యతిరేక నినాదాలతో గందరగోళం సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా ఉందని, సీఎం కేసీఆర్ అనేక పథకాల్ని అమలు చేస్తున్నారని మల్లారెడ్డి ప్రశంసలు కురిపిస్తున్న తరుణంలో సభికుల నుంచి ఒక్కసారిగా వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. దీంతో ఆయన తన ప్రసంగం ముగించుకొని కాన్వాయ్‌లో వెళుతుండగా.. నిరసనకారులు కుర్చీలు,…
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో ఆదివారం సాయంత్రం జరిగిన రెడ్డి సింహగర్జన బహిరంగ సభలో మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో.. ప్రతి ఊరుని అభివృద్ధి చేశామని చెప్పినప్పుడు.. సభలో వ్యతిరేక నినాదాలు రేకెత్తాయి. అంతేకాదు.. తన ప్రసంగం ముగించుకొని మంత్రి వెళ్తున్న క్రమంలో వాహనంపై దాడి చేశారు. కుర్చీలు, రాళ్ళు విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతకుముందుకు సభలో మంత్రి మల్లారెడ్డి ప్రసంగిస్తూ.. తన నియోజకవర్గంలో రెడ్డి సభ నిర్వహించడం…
తమ తరఫున దేవుడికి పూజలు నిర్వహించినందుకు గాను పూజారులకు భక్తులు ఎంతో కొంత దక్షిణ ఇస్తుంటారు. ఇది పూర్వం నుంచి వస్తోన్న సంప్రదాయం. లాజికల్‌గా చూసుకుంటే.. ఏ పూజారికి అయితే దక్షిణ లభిస్తుందో, అది అతనికే సొంతం. కానీ.. తన ఆదేశాల మేరకు మరో పూజారి పూజ నిర్వహించినందుకు, వచ్చిన దక్షిణలో తనకూ కొంత మొత్తం ఇవ్వాలని ఓ అర్చకుడు గొడవకు దిగిన సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మేళ్ళచెరువు…