అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో బంగారు పతకాలు సాధించిన తెలంగాణ బిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్, ISSF షూటింగ్ పోటీల్లో స్వర్ణ పతకం గెలుచుకున్న ఇషా సింగ్‌లకు ఒక్కొక్కరికి రూ.2 కోట్ల నగదు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అంతేకాకుండా ఇంటి స్థలాన్ని కూడా కేటాయిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జూబ్లీహిల్స్ లేదా బంజారాహిల్స్‌లో ఇంటి స్థలం కేటాయిస్తామని తెలిపింది. కాగా ఇటీవల టర్కీ…
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేటలోని రెడ్డి భవన్ లో గీత కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేకనే కేంద్రం ఇబ్బందులు పెడుతోందని ఆయన అన్నారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. రూ. 4 వేల కోట్లు జీఎస్టీ కింద రావాలని.. 15 వ ఆర్థిక సంఘం రూ. 6…
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో తాజాగా ఈడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు ఎంపీ రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. జూన్ 5న రాహుల్ గాంధీని, జూన్ 8న సోనియాగాంధీని తమ ముందు హాజరు కావాలని కోరింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇద్దరు స్టేట్మెంట్లు రికార్డు చేసుకోనున్నారు ఈడీ అధికారులు. అయితే కాంగ్రెస్ నాయకులకు సమన్లు ఇవ్వడాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది కక్ష సాధింపు చర్య అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్…
గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఐటీలో అద్భుతమైన పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. 2021-22 ఏడాదికి ఐటీ వార్షిక నివేదికను హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా సంక్షోభం తర్వాత సాధారణ స్థితికి రావడానికి అనేక రంగాలు ఆపసోపాలు పడుతుంటే.. తెలంగాణలో ఐటీ రంగం శర వేగంగా దూసుకుపోతుందని, గత రికార్డులను బద్దలు కొడుతూ 2021-22 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను…
కొద్దిరోజుల నుంచి తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్లు తెలంగాణకు క్యూ కట్టడంతో.. పాలిటిక్స్ జోరందుకుంది. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెంచింది. మరోవైపు.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై కసరత్తును ప్రారంభించింది. ఈ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించునున్నారు. ఇందులో భాగంగా బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.ఎల్. సంతోష్ నగరానికి బుధవారం వచ్చారు. కాగా, మూడు రోజల పాటు జరిగే ఈ…
ఇవాల్టి నుంచి కాంగ్రెస్ చింతన్ శిబిర్ కార్యక్రమం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈమేరకు కీసరలో రెండు రోజుల పాటు మేధోమథన సదస్సు జరగనుంది. ఉదయ్‌పూర్ తీర్మానాలపై చర్చించి వాటికి టీపీసీసీ ఆమోదం తెలుపుకుంటుంది. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా భవిష్యత్తు కార్యాచరణపై నేతలు చర్చించుకుంటారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కమ్ ఠాగూర్ హాజరు కానున్నారు. 2 రోజుల సమావేశాల్లో రాజస్థాన్ లోని ఉదయ్…
తెలంగాణలో మద్యం కిక్కు బాగా ఎక్కువైంది. ధరలు పెరిగినా మందుబాబుల తీరు మారడం లేదు. ధర ఎంతైనా తాగేస్తాం.. ఊగేస్తాం అన్నట్టుగా వుంది వారి తీరు. మే నెలలో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. గత నెల కన్నా పెరిగిన మద్యం సేల్స్ మందుబాబుల దూకుడుకు సంకేతంగా చెబుతున్నారు. మద్యం ధరలు పెంచితే అమ్మకాలు తగ్గుతాయని భావించారు. కానీ అలాంటిదేం లేదని తేలిపోయింది. ఏప్రిల్ నెలలో 27 లక్షల 92వేల721 లిక్కర్ కేసులు…
*ఉదయగిరిలో ఎం.ఎల్.ఏ.మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి పర్యటన. *కోవూరులో ఎం.ఎల్.ఏ.నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పర్యటన *ఇవాళ్టి నుంచి తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం. అలిపిరి వద్ద తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే అనుమతించనున్న టీటీడీ. *శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న జనసేన నేత కొణిదెల నాగబాబు. నియోజకవర్గాల సమన్వయ కర్తలు , ద్వితీయ శ్రేణి నేతలతో సమావేశం. *విశాఖలో నేడు, రేపు మాజీ కేంద్రమంత్రి సురేష్ ప్రభు ఉత్తరాంద్ర టూర్….కేజీహెచ్ లో ఎంపీ నిధులతో కొనుగోలు…
తెరపై ప్రతినాయకునిగా భయపెట్టినా, నిజజీవితంలో ఎంతో సౌమ్యులు, పది మందికి మేలు చేయాలని తపించేవారు డాక్టర్ ఎమ్.ప్రభాకర్ రెడ్డి. ఆ తపనతోనే తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు తరలి వస్తున్న సమయంలో సినీకార్మికుల పక్షాన నిలచి ముందు వారికి నివాసస్థలాలు ఇవ్వాలని పట్టు బట్టి మరీ ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఆయన కృషి ఫలితంగానే హైదరాబాద్ లో నేడు అతి ఖరీదైన ప్రాంతంగా నెలకొన్న మణికొండలో సినీకార్మికుల గృహసముదాయం వెలసింది. దానికి ‘డాక్టర్ ఎమ్.ప్రభాకర్ రెడ్డి చలనచిత్ర…