Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రెజెంటేషన్ వేదికపై కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం జట్టు ఓటమిపై స్పందిస్తూ, మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ ఇన్నింగ్స్‌ను కొనియాడుతూనే, అతడే తమ ఓటమిని శాసించాడని పేర్కొన్నాడు.
“మ్యాచ్ ఎక్కడ చేజారిందో మనందరికీ తెలుసు. కానీ నేను ఏ ఒక్క ఆటగాడిని వేలెత్తి చూపించాలనుకోవడం లేదు. ఆ తప్పు తర్వాత అతడు బలంగా పుంజుకుంటాడని అనుకున్నాను. ఆ 17వ ఓవర్ మమ్మల్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఈ పిచ్‌పై మేము చేసిన 190 పరుగులు అద్భుతమైన స్కోరు. మొదటి 15 ఓవర్ల వరకు మ్యాచ్‌పై మాకే పూర్తి పట్టు ఉంది. కానీ ఒక్కసారిగా మ్యాచ్ మారిపోయింది. జాకబ్ బెథెల్ ఆడిన ఇన్నింగ్స్‌కు పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. వారు గ్రౌండ్ డైమెన్షన్స్, వికెట్‌ను ముందే అంచనా వేశారు” అని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.
Also Read
- Hyderabad: నిమ్స్ ఆస్పత్రిలో ముగిసిన ఏసీబీ సోదాలు.. అర్ధరాత్రి వరకు తనిఖీలు
- School Holidays: అర్నబ్ తుఫాన్ ప్రభావం.. సెలవులు పొడిగించిన విద్యాశాఖ!
- Bharat Mobility Expo 2027: కార్ల ప్రియులకు పండుగే.. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2027 తేదీలు ఖరారు..!
- AFG vs ZIM: 5 పరుగులకే 4 వికెట్లు.. ఆ తర్వాత ఒమర్జాయ్ సిక్సర్ల సునామీ.. కట్ చేస్తే ప్రపంచ రికార్డ్ సొంతం.!
రవి బిష్ణోయ్ వేసిన ఆ 17వ ఓవర్లో నో-బాల్స్, ఫ్రీ-హిట్లను వాడుకుంటూ జాకబ్ బెథెల్ ఏకంగా 29 పరుగులు రాబట్టి భారత్ చేతుల్లోంచి విజయాన్ని లాగేసుకున్నాడు. టి20 క్రికెట్లో క్రీజ్ దాటి నో-బాల్స్ వేయడం తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది. బెథెల్ లాంటి ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌కు ఒకే ఓవర్లో నో-బాల్స్ వేసి, ఫ్రీ-హిట్లు ఇస్తే అతడు వదిలిపెట్టడని, ఆ ఓవరే తమ ఓటమిని శాసించిందని స్పష్టం చేశాడు. తమ వైపు ఉందనుకున్న విజయం కాస్త చేజారిపోవడంతో కెప్టెన్ అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
మరోవైపు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న జాకబ్ బెథెల్ మాట్లాడుతూ.. “చివరికి అంతా బాగానే ముగిసింది. మేము రెండు వికెట్లు కోల్పోయినప్పుడు హ్యారీ బ్రూక్ మంచి మొమెంటం ఇచ్చాడు. రవి బిష్ణోయ్ వేసిన ఓవర్లో నిజాయితీగా చెప్పాలంటే నేను విండ్ (గాలి వాలు), షార్ట్ బౌండరీ ఉన్న వైపు టార్గెట్ చేయాలనుకున్నాను. కానీ కొన్ని ఫ్రీ-హిట్లు లభించడంతో బౌలర్ పూర్తిగా ఒత్తిడిలోకి వెళ్ళిపోయాడు, అది నాకు కలిసి వచ్చింది. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుపై ఇలాంటి ప్రదర్శన చేయడం ఆనందంగా ఉంది” అని అన్నాడు. ఈ ఓటమితో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ వెనుకంజలో పడింది.
తాజావార్తలు
-
ISRO NVS-03 Satellite: నేడు రాత్రి 11:51 గంటలకు ఇస్రో కీలక ప్రయోగం.. నింగిలోకి NVS-03 ఉపగ్రహం!
-
Hyderabad: నిమ్స్ ఆస్పత్రిలో ముగిసిన ఏసీబీ సోదాలు.. అర్ధరాత్రి వరకు తనిఖీలు
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
Operation Firewall 2026: పాక్ ఏజెంట్లకు సహకారం.. బీహార్‌లో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం
-
School Holidays: అర్నబ్ తుఫాన్ ప్రభావం.. సెలవులు పొడిగించిన విద్యాశాఖ!
ట్రెండింగ్
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!