తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు, బీజేపీ నేతల మధ్య మధ్య మాటల యుద్ధంగా తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఆమధ్య బీజేపీ నిర్వహించిన ఓ బహిరంగ సభ నుంచి మొదలైన ఈ మాటల పోరు.. అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఒకరిపై మరొకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటినుంచే తమ పార్టీనే గెలుస్తుందంటూ సమరశంఖం పూరిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా తమ బీజేపీనే వచ్చే ఎన్నికల్లో…
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిల్చున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివస్తున్నారు. స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం పట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా పోలీసులు కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తుల రద్దీ ఎక్కువ కావడం వల్లె వాహనాలను…
ఇంటి ముందు తల్లి చీరతో కట్టిన ఊయల ఆ చిన్నారికి ఉరితాడైంది. ఊయలతో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల చిన్నారికి.. చీర మెడకు బిగిసుకుపోవడంతో ఊపిరాడక ఆ చిన్నారి అక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. లాలాపేట్కు చెందిన రాజేష్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య ప్రసన్నజ్యోతి కూలి పనులకు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె కోట ఎలీనా (8) శనివారం ఇంటి ముందు తల్లి చీరను…
గుడ్ న్యూస్ చెప్పింది భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ). భారత వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముఖగా భావించే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. సాధారణం కన్నా మూడు రోజుల ముందే మే 29న కేంద్రంలోకి ప్రవేశించాయని ఐఎండీ వెల్లడించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే ఈ సారి అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో మూడు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రంలోకి వ్యాపించాయి. అయితే అంతకుముందు బంగాళా ఖాతంలో అసనీ తుఫాన్…
ప్రజా ప్రస్థాన యాత్రలో భాగంగా వేయి కిలోమీటర్లు పూర్తి చేసుకుని ప్రతిక్షణం, ప్రతిరోజు రైతుకోసం చేస్తున్న రైతుగోస ధర్నాలో పాల్పంచుకున్న అందరికి ధన్యావాదాలు తెలిపారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సదాశివునిపేటలో రైతుగోస ధర్నాలో పాల్గొన్నషర్మిల సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని, పంట వేయని రైతులకు ఎకరాకు 25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మోసం చేయని వర్గం లేదని, దొంగ హామీలు ఇచ్చేందుకు…
ఇంటి నిర్మాణం కోసం ముగ్గుపోయాలంటే వారికి ముడుపులు చెల్లించాల్సీందే. ముడుపు ముట్టజెప్పకపోతే ముప్పుతిప్పలు తప్పవు మరి. పిల్లర్ల ఎత్తును బట్టి వసూల్ రాజాలు రేటు ఫైనల్ చేస్తారు. అడిగినంత ఇవ్వకపోతే ఆగమాగమే. బీపాస్ లో దరఖాస్తు చేరితే చాలు సంబరాలు చేసుకుంటున్నారట ఆ వసూల్ రాజాలు.. అక్కడ ఇల్లుకట్టుకొవాలంటే మున్సిపాలిటీ అనుమతి కంటే ఆనేతల అనుమతే ముఖ్యంగా మారింది. నల్లగొండ పట్టణంలో ఇంటి నిర్మాణాలకు బీపాస్ లో దరఖాస్తు చేసుకుని నిబంధనల ప్రకారం అనుమతులు ఉంటే సరిపోదు.…
వేసవి సెలవులు నడుస్తుండడంతో తిరుమలకు వెళ్ళే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భక్తులకు కీలక సూచనలు అందించారు. భక్తుల రద్దీ కారణంగా దర్శనాల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కాగా, భక్తులకు అవసరమైన సౌకర్యాలను అందిస్తున్నామని, స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు ఆహారం, తాగేందుకు నీరు అందిస్తున్నామన్నారు.…
కన్నతండ్రి కంటికి రెప్పలా కాపాడాలి. కానీ అతనే యముడయ్యాడు. భర్త అంటే భరించేవాడు. కానీ ఆ భర్త ఆ ఇల్లాలి పాలిట కర్కోటకుడు అయ్యాడు. భార్య, ఇద్దరు పిల్లల్ని దారుణంగా హతమార్చాడు. అతను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. చెన్నై లో జరిగిన ఈ దారుణం అందరినీ కలిచివేసింది. అప్పుల భారం తట్టుకోలేక భార్య,ఇద్దరు పిల్లలను రంపంతో కోసి చంపేశాడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రకాష్. ఎలక్ట్రిక్ రంపాన్ని అమెజాన్లో కొనుగోలు చేశాడు ప్రకాష్. ముగ్గురిని చంపి తను…
పెరుగుతున్న కూరగాయల ధరలు వంటింటి బడ్డెట్ ను తలకిందులు చేస్తుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ధరలు పెరుతున్న వేగంగా తమ వేతనాలు పెరగక పోవడంతో అర్థ ఆకలితో కొంతమంది.. మరొ కొంతమంది ఒకపూజ భోజనం తోనే సరిపెట్టుకుంటూ.. కుటుంబాన్ని భారంగా నెట్టుకొస్తున్నారు. పెరిగిన ధరల కారణంగా సామాన్య మానువుని మంచి పోషకాలను అందించే పప్పు ధాన్యాలు ఏవీ కూడా రూ.200లకు ఇంచుమించు ఏది తక్కువగా ఉండటం లేదు. కంది పప్పు ధర…
పెరుగుతోన్న ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వాహనదారులు బండి బయటకు తీయలేని పరిస్థితి నెలకొంది. ఇంధన ధరలు క్రమంగా ఎగబాకుతూ వచ్చి క్రమాంగా లీటరుకు రూ.120 దాటాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం మరోసారి తగ్గించింది. దీంతో భారీ ఎత్తున ధరల్లో మార్పు కనిపించింది. పెట్రోల్ ధరలో రూ.9 కి పైగా, డీజిల్ ధరలో రూ.7 రూపాయలకు పైగా తగ్గింది. దీంతో కాస్తయినా ఉపశమనం కలిగిందని సామాన్యులు భావిస్తున్నారు. హైదరాబాద్లో పెట్రోల్ డీజిల్ ధరలు…