Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
- ఎయిర్టైట్ డబ్బాలతో తేమకు చెక్
- ఉప్పు, చక్కెర కరగకుండా సులభ చిట్కాలు
- పప్పులు, రవ్వకు పురుగులు రాకుండా ఇలా
- బిస్కెట్లు కరకరలాడాలంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rainy Season Kitchen Tips : వర్షాకాలం రాగానే చల్లని వాతావరణం మనకు హాయినిచ్చినా, వంటగదిలోని సరుకులకు మాత్రం అనేక సమస్యలు తెస్తుంది. గాలిలో ఉండే అధిక తేమ కారణంగా ఉప్పు, చక్కెర కరిగిపోవడం, బిస్కెట్లు మెత్తబడటం, పప్పులు, గోధుమ పిండి, రవ్వ వంటి వాటికి పురుగులు పట్టడం మనం తరచుగా చూస్తుంటాం. అయితే, మన వంటగదిలోని చిన్నచిన్న చిట్కాలను పాటిస్తే ఈ సమస్యలన్నింటినీ సులభంగా దూరం చేసుకోవచ్చు.
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
గాలి చొరబడని డబ్బాలతో రక్షణ
వాతావరణంలోని తేమ సరుకులకు తగలకుండా ఉండాలంటే వాటిని సరైన పద్ధతిలో నిల్వ చేయడం చాలా ముఖ్యం. మసాలాలు, పప్పులు, చక్కెర, ఉప్పు వంటి వాటిని ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల గాజు లేదా ప్లాస్టిక్ ఎయిర్-టైట్ కంటైనర్లలోనే భద్రపరచాలి. ఈ డబ్బాల మూతలను గట్టిగా మూసి ఉంచడం వల్ల బయటి గాలి లోపలికి వెళ్లదు, తద్వారా సరుకులు బూజు పడకుండా చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి.
ఉప్పు, చక్కెర కరగకుండా ఉండాలంటే..
వర్షాకాలంలో ఉప్పు త్వరగా నీరుగా మారిపోకుండా ఉండటానికి ఒక చిన్న కాటన్ వస్త్రంలో కొద్దిగా బియ్యాన్ని మూటకట్టి ఉప్పు జాడీలో అడుగున ఉంచండి. బియ్యం సహజంగానే అదనపు తేమను పీల్చుకుని ఉప్పును ఎప్పుడూ పొడిగా ఉంచుతుంది. అలాగే, గాలి తగిలి చక్కెర గడ్డకట్టకుండా ఉండాలన్నా, దానికి మంచి సువాసన రావాలన్నా ఆ చక్కెర జాడీలో రెండు లేదా మూడు లవంగాలను వేసి నిల్వ చేస్తే సరిపోతుంది.
పప్పులు, రవ్వలకు పురుగులు పట్టకుండా..
బొంబాయి రవ్వ, శనగపిండి, పప్పు దినుసులు తేమ వాతావరణంలో త్వరగా పురుగులు లేదా చిమ్మటల బారిన పడతాయి. దీన్ని నివారించడానికి, వాటిని డబ్బాలో నిల్వ చేయడానికి ముందు బాణలిలో కొద్దిగా వేయించాలి (డ్రై రోస్ట్ చేయాలి). అవి పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో నిల్వ చేస్తే పురుగులు పట్టే అవకాశమే ఉండదు. వీటికి మరింత రక్షణ కల్పించడానికి ఆ డబ్బాల్లో కొన్ని ఎండిన వేప ఆకులు, రెండు మూడు ఎండు మిరపకాయలు లేదా బిర్యానీ ఆకులు వేయాలి. వాటి ఘాటైన వాసనకు కీటకాలు అసలు దరిచేరవు.
కరకరలాడే బిస్కెట్లు, స్నాక్స్ కోసం..
ప్యాకెట్ తీసిన కాసేపటికే బిస్కెట్లు, స్నాక్స్ మెత్తబడిపోవడం వర్షాకాలంలో సర్వసాధారణం. అలా జరగకుండా ఉండాలంటే వాటిని ఎల్లప్పుడూ జిప్-లాక్ కవర్లలో లేదా లోహపు, గాజు డబ్బాల్లో భద్రపరుస్తూ, డబ్బా అడుగున ఒక టిష్యూ పేపర్ ఉంచండి. అది గాలిలోని తేమను పూర్తిగా పీల్చుకుంటుంది. కావాలంటే కొన్ని బియ్యపు గింజలను టిష్యూ పేపర్లో చుట్టి బిస్కెట్ల డబ్బాలో వేసినా కూడా అవి ఎంతో కాలం పాటు మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటాయి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు