పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లోని సింగరేణి నిర్వాశిత గ్రామం లద్నాపూర్ గ్రామస్తులు నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు..గ్రామంలో ఉన్న 283 మంది భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో నిర్వాసితులు నిరసన బాట పట్టారు. ఓసీపీ 2 విస్తరణలో భాగంగా గ్రామాన్ని బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తే ఉరుకోబోమని హెచ్చరిస్తున్నారు.. సింగరేణి భూనిర్వాసిత గ్రామం లద్నపూర్ లో నిర్వాసితులకు సింగరేణి అధికారులకు మధ్య గొడవ కంటిన్యూ అవుతుంది..సింగరేణి అధికారులు…
తెలంగాణలో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాల పేలుడు వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు ఇంధన ధరల పెరుగుదల.. మరోవైపు పర్యావరణ హితం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తే ఇలాంటి ఘటనలు వాటిని కొనుగోలు చేయాలనుకున్న మిగతా వారిలో భయాన్ని పుట్టిస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండంల పెద్ద చీకోడు గ్రామంలో ఛార్జింగ్ పెట్టిన ఓ ఎలక్ట్రిక్ వాహనంలో బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో ఎవరికీ ఏం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక…
నగరం మధ్యలో ‘అమీబా’ ఆకారంలో ఉండే సాగర్ పర్యాటకం పరంగా అత్యంత ఆహ్లాదమైన ప్రదేశం. సరస్సు మ ధ్యలో ప్రపంచలోనే అతి పొడవైన బుద్దు డి విగ్రహం ఒక అ పురూపమైన అద్భుత దృశ్యం. దీన్ని న్యూయార్క్ లోని ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ తరహాలో ఏర్పాటు చేశారు. దీనిని వీక్షించేందుకు నిత్యం పెద్ద సంఖ్యలో సందర్శకులు విచ్చేస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని చెరువు చుట్టూ లూప్ రూపంలో ఒక సమగ్రమైన రోప్ నెట్ వర్క్ ను ఏర్పాటు…
బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించబోతోంది. ఇప్పటికే హైదరాబాద్ లో వేదిక కూడా ఖరారు చేశారు. జూలై 2,3 తేదీల్లో కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా అగ్రనేతలందరూ హాజరుకానున్నారు. ఇప్పటికే కార్యక్రమం భారీ స్థాయిలో నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ నేతలకు ఆదేశాలు అందాయి. వచ్చే ఎన్నికలను ప్రభావితం…
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. నేరస్తులను వదిలి, న్యాయం కోసం పోరాడుతున్న వారిపై కేసులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో దోషులను ఎందుకు అరెస్ట్ చేయరని ప్రశ్నించారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. టీఆర్ఎస్, ఎంఐఎం అరాచకాలను పాతరేసే దాకా ఉద్యమిస్తూనే ఉంటామని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో తప్పు చేసిన నేరస్తులను వదిలేసి న్యాయం…
రాస్ట్ర వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. నార్మర్ డెలవరీలను ప్రోత్సహించేందుకు కీలక ప్రకటన చేశారు. నార్మల్ డెలివరీలు చేయిస్తే రూ. 3000 పారితోషకం ప్రకటించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సులు, వైద్య వర్గాలు నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రజారోగ్యం కోసం మార్పు తెద్దాం అని సూచించారు. సిజేరియన్లను ప్రోత్సహించ వద్దని కోరారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరగాలని అన్నారు. నార్మల్ డెలివరీలు ఎక్కువగా పెరగాలని.. ప్రభుత్వం, ప్రైవేటు ఆస్పత్రికి తేడా…
ప్రభుత్వ వైద్యులకు తెలంగాణ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యుల్లో ఎక్కువ మంది ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుంటారు. అయితే ఇకపై ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయరాదంటూ మంగళవారం నాడు హెల్త్ సెక్రటరీ రిజ్వీ జీవో విడుదల విడుదల చేశారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వైద్యులు ప్రాక్టీస్ చేసుకోవచ్చని.. వారిపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని క్లారిటీ…
దేశీయ క్రీడలకు నెమ్మదిగా ప్రాధాన్యం పెరుగుతోంది. ఇప్పటికే ఐపీఎల్, ప్రొ.కబడ్డీ లీగ్ వంటి టోర్నీలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఖోఖో క్రీడకు సంబంధించి ఓ మెగా లీగ్ రాబోతోంది. ఈ ఏడాది ప్రారంభం కానున్న అల్టిమేట్ ఖోఖో లీగ్(యూకేకే)లో తెలంగాణకు చెందిన టీమ్‌ను జీఎంఆర్ కొనుగోలు చేసింది. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కేకేఎఫ్ఐ) సహకారంతో ఖోఖో లీగ్‌ను డాబర్ గ్రూప్ ఛైర్మన్ అమితక బర్మన్ ఏర్పాటు చేయగా పలు రాష్ట్రాల నుంచి ఫ్రాంచైజీలు…
తెలంగాణ వ్యాప్తంగా జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన సంచలంన కలిగించింది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులు రాజకీయ నాయకులకు చెందిన పిల్లలుగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ ఘటన రాజకీయంగా కూడా చర్చనీయాంశం అయింది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు అధికార టీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నాయి. రాజకీయ ప్రోద్భలం ఉండటంతోనే అధికారులు చర్యలు ఆలస్యం అవుతున్నట్లుగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బాధితురాలి ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేయడంతో ఈ అంశం…