‘అల వైకుంఠపురం’తో బుట్టబొమ్మను పూజా హెగ్డే సర్ నేమ్‌గా మార్చేసుకున్నారు. అయితే ఆ పేరుకు ఉన్న క్రేజ్ మాత్రం నిలబెట్టుకోవడంలో ఫెయిలయ్యారు. అల వైకుంఠపురం సినిమా తర్వాత తెలుగులో ఒక్క హిట్ లేదు. ‘గుంటూరు కారం’ మిస్ చేసుకొని ఉండకపోతే హిట్ చూసేదే కానీ.. సక్సెస్ క్రెడిట్ శ్రీలీల ఖాతాలోకి చేరిపోయింది. టాలీవుడ్‌లో కలిసి రావడం లేదని బీటౌన్‌లోకి ఎంట్రీ ఇస్తే.. అక్కడ కూడా డిజాస్టర్స్ పలకరించాయి. దాంతో పూజా కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టారు.
‘దళపతి’ విజయ్ నటించిన బీస్ట్ తర్వాత తమిళంలో ఆ రేంజ్ సక్సెస్‌ను పూజా హెగ్డే చూడలేదు. గత ఏడాది ‘రెట్రో’లో డీ గ్లామర్ చేసినా.. కూలీలో ‘మోనికా బెలూచి’ అంటూ గ్లామర్ ట్రీట్ ఇచ్చినా పెద్దగా వర్కౌట్ కాలేదు. మళ్లీ విజయే సక్సెస్ ఇస్తాడని గట్టిగా నమ్ముతున్నారు బుట్టబొమ్మ. ‘జన నాయగన్’తో పాత లెక్కలన్నీ సరిచేయాలని అనుకుంటున్నారు. విజయ్ చివరి సినిమా కావడంతో తన ఎక్స్ పెక్టేషన్స్ రీచౌతాయనే నమ్మకంతో పూజా ఉన్నారు.
Also Read: Bhartha Mahasayulaku Wignyapthi: వామ్మో వాయ్యో.. ఇద్దరు హాట్ భామలతో రవితేజ రొమాన్స్!
తమిళంలో ‘కాంచన 4’తో పాటు హిందీలో ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ సిన్మాలు చేస్తున్నారు పూజా హెగ్డే. తెలుగులో గుంటూరు కారం నుంచి తప్పుకున్న తర్వాత మరో మూవీకి సైన్ చేయని పూజా.. లాస్ట్ ఇయర్ దుల్కర్ సల్మాన్ 41లోకి సడెన్ ఎంట్రీ తీసుకున్నారు. అల వైకుంఠపురం తర్వాత తెలుగులో హిట్ చూడని ఈ భామ.. డీక్యూ 41తో కంబ్యాక్ అవుతుందా?, లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీలో మళ్లీ బిజీగా మారుతుందా? లేదా గెస్ట్‌గా మారుతుందా.? అనేది చూడాలి.