ఖమ్మం జిల్లా వైరా మండలం గన్నవరం ఖానాపురం గ్రామాల్లో 89 వ రోజు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్రకు స్థానిక ప్రజలు వైఎస్సార్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా పాదయాత్రలో గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి షర్మిల నివాళులర్పించారు. గ్రామంలోని ప్రజలు రైతుల కోరిక మేరకు షర్మిల తలపాగా చుట్టి రైతు అవతారంలో ట్రాక్టర్ నడిపి వైఎస్సార్ అభిమానులను రైతులను ఆనందపరిచారు. గన్నవరం నుంచి ఖానాపూర్ వరకు ట్రాక్టర్ నడిపారు.…
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తీపి కబురు చెప్పింది. మరో రెండు రోజుల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న వెల్లడించారు. ఈ నెల 12 నాటికి తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. చత్తీస్ గఢ్ నుంచి కోస్తా మీదుగా ఏర్పడిన ద్రోణి గురువారం తెలంగాణ నుంచి దూరంగా వెళ్లిందని దీంతో రుతుపవనాలు ముందుకు కదిలేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. రాబోయే రెండు రోజులు గోవా, కర్నాటకతో పాటు దక్షిణ ఏపీలోని…
రాష్ట్రంలో శాంతి భద్రతలపై అఖిల పక్షంతో చర్చిద్దాం అని సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో క్షీణిస్తున్న శాంతిభద్రతలపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని.. తెలంగాణను కాపాడుకోవడానికి ఎలాంటి శశబిషలు లేకుండా ప్రగతి భవన్ కు స్వయంగా నేనే వస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ లో పబ్, క్లబ్, డ్రగ్స్ వాడకం తీవ్ర భయాందోళనను కలిగిస్తున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు, తమ…
జూబ్లీహిల్స్ రేప్ కేసులో పోలీసులు తీసుకున్న సంచలన నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. అత్యాచారం వంటి పెద్ద నేరాలకు పాల్పడే వ్యక్తులు.. పెద్దవారిగానే శిక్షించబడాలని.. యువకుడిగా కాదని ఆయన అన్నారు. I welcome & support the stand of @TelanganaCOPs If you are adult enough to commit a crime as heinous as rape, one must also be punished as…
అధికారిక వాహనాల్లో రేపులు జరిగితే కూడా పట్టదా..? అంటూ టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో రేవంత్ మాట్లాడుతూ.. అధికారిక వాహనాల్లో కూడా అత్యాచారాలు జరిగినా చర్యలు తీసుకోవడం లేదు అంటే కెసిఆర్ ప్రోస్తహిస్తున్నట్టే అని విమర్శలు గుప్తించారు. కెసిఆర్ కో నచ్చితే నజరానా..? లేదంటే శిక్షలు అంటూ మండిపడ్డారు. కెసిఆర్..ఎంఐఎం పాలనలోనే పొత్తు కాదు, అత్యాచారాలు కూడా పొత్తు ల్లోనే చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ నీ ఎందుకు తీసేయడం…
అత్తా కోడళ్ళ పంచాయతీ లెక్క బీజేపీ, టీఆర్ఎస్ పంచాయతీ అని టీపీసీసీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గురువారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో రేవంత్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీ ఇద్దరూ కలిసే ఉన్నారని విమర్శించారు. వాళ్ళు వేరు వేరు అని ఎప్పుడూ అనుకోవద్దని, ఏ విషయంలో సరే వాళ్ళు విడిపోయారు చెప్పండని ప్రశ్నించారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచుతున్నాడు కెసిఆర్ అని చెప్పింది బీజేపీ నే అని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. అప్పులు తెచ్చుకో అని 4…
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. కేసులో ప్రధాన నిందితుడు ఏ-1 సాదుద్దీన్‌ను చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారించాల్సి ఉన్నందున సాదుద్దీన్ మాలిక్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరగా.. న్యాయస్థానం 4 రోజులు అనుమతిచ్చింది. సాదుద్దీన్‌ను జూబ్లీహిల్స్ పీఎస్‌లోని ప్రత్యేక గదిలో బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ విచారిస్తున్నారు. Jubilee hills Case: జూబ్లీహిల్స్ రేప్ కేసులో పోలీసుల సంచలన నిర్ణయం అత్యాచారానికి సహకరించిన ఇతర నిందితుల…
ప్రజా సమస్యల పరిష్కారం కొరకై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపడుతున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర గురువారం ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలోని అంకమ్మ దేవాలయం నుంచి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా అంకమ్మ దేవాలయంలో ఆయన భార్య మల్లు నందిని భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు జరిపారు. గ్రామాల్లోని ప్రజలను పలకరిస్తూ వారి వ్యక్తిగత సమస్యలు వింటూ భట్టి విక్రమార్క పాదయాత్రను కొనసాగిస్తున్నారు. KCR : తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు వస్తాయా.?ఆ అవసరం…
తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు వస్తాయా ? ఏపీ, తెలంగాణలో అధికార పార్టీలు.. ఆ దిశగా ముందుకు వెళ్తున్నాయా ? విపక్ష నేతలు చేస్తున్న ప్రచారంలో నిజం ఎంత ? అసలు ఎందుకు ఈ రకమైన ప్రచారం జరుగుతోంది ? తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇటు తెలంగాణలోనూ రాజకీయ వాతావరణ వేడెక్కింది. అన్ని పార్టీలు తమ పాలిటిక్స్‌ను యాక్టివ్ మోడ్‌లోకి మార్చేశాయి. ముందస్తు ఎన్నికల ప్రచారాలతో ఈ వాతావరణం మరింత…