దేశీయ క్రీడలకు నెమ్మదిగా ప్రాధాన్యం పెరుగుతోంది. ఇప్పటికే ఐపీఎల్, ప్రొ.కబడ్డీ లీగ్ వంటి టోర్నీలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఖోఖో క్రీడకు సంబంధించి ఓ మెగా లీగ్ రాబోతోంది. ఈ ఏడాది ప్రారంభం కానున్న అల్టిమేట్ ఖోఖో లీగ్(యూకేకే)లో తెలంగాణకు చెందిన టీమ్‌ను జీఎంఆర్ కొనుగోలు చేసింది. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కేకేఎఫ్‌ఐ) సహకారంతో ఖోఖో లీగ్‌ను డాబర్ గ్రూప్ ఛైర్మన్ అమితక బర్మన్ ఏర్పాటు చేయగా పలు రాష్ట్రాల నుంచి ఫ్రాంచైజీలు ఏర్పడుతున్నాయి. ఈ లీగ్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను సోనీ సంస్థ దక్కించుకుంది. సోనీ టీవీ ఛానెళ్లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో యూకేకే పోటీలు స్ట్రీమింగ్ కానున్నాయి.
Viral Video: తాగిన మైకంలో రోడ్డు మీద రచ్చ చేసిన చాహల్, నెహ్రా
అయితే సౌతిండియాలో ఖోఖోకు ఉన్న ప్రజాదరణ ఆధారంగా ఖోఖో లీగ్‌లో తాము పెట్టుబడి పెట్టామని జీఎంఆర్ వెల్లడించింది. మిగతా క్రీడల తరహాలో ఖోఖోను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ టీమ్‌ను తీసుకున్నామని జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ ఛైర్మన్ కిరణ్ కుమార్ తెలిపారు. క్రీడల్లోనూ భారత్ అగ్రగామిగా అవతరించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అటు ఖోఖో లీగ్‌లో గుజరాత్ టీమ్‌ను అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. కబడ్డీ, బాక్సింగ్ లీగ్‌లో ఉన్న తమ అనుభవం ఖోఖో లీగ్‌లోనూ అద్భుతాలు చేస్తుందని అదానీ ఎంటర్‌ప్రైజస్ డైరెక్టర్ ప్రణవ్ అదానీ అభిప్రాయపడ్డారు.