ప్రభుత్వ వైద్యులకు తెలంగాణ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యుల్లో ఎక్కువ మంది ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుంటారు. అయితే ఇకపై ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయరాదంటూ మంగళవారం నాడు హెల్త్ సెక్రటరీ రిజ్వీ జీవో విడుదల విడుదల చేశారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వైద్యులు ప్రాక్టీస్ చేసుకోవచ్చని.. వారిపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని క్లారిటీ ఇచ్చారు.
రాష్ట్రంలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు, పారామెడికల్ సిబ్బందిని నియమించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం అందుకోసం కసరత్తు చేపట్టింది. ఈ తరుణంలో నియామక మార్గదర్శకాల్లో ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీస్ రద్దు అంశం కీలకంగా మారింది.
Breaking : మరో 196 పోస్టుల భర్తీ ఆర్థిక శాఖ గ్నీన్ సిగ్నల్..
కాగా రంగారెడ్డి జిల్లా వైద్యాధికారులతో మంత్రి హరీష్ రావు సోమవారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖలో త్వరలో 1,326 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని మెడికల్ బోర్డును ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై తాజాగా ప్రభుత్వం విధించిన నిబంధన గురించి మంత్రి హరీష్‌రావు ప్రస్తావించారు. ఈ నిబంధన పాటించని వైద్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్య, ఆరోగ్య శాఖలో మొత్తం 12,755 పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. తొలి దశలో 1,326 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి హరీష్‌రావు పేర్కొ్న్నారు.