నగరం మధ్యలో ‘అమీబా’ ఆకారంలో ఉండే సాగర్ పర్యాటకం పరంగా అత్యంత ఆహ్లాదమైన ప్రదేశం. సరస్సు మ ధ్యలో ప్రపంచలోనే అతి పొడవైన బుద్దు డి విగ్రహం ఒక అ పురూపమైన అద్భుత దృశ్యం. దీన్ని న్యూయార్క్ లోని ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ తరహాలో ఏర్పాటు చేశారు. దీనిని వీక్షించేందుకు నిత్యం పెద్ద సంఖ్యలో సందర్శకులు విచ్చేస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని చెరువు చుట్టూ లూప్ రూపంలో ఒక సమగ్రమైన రోప్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించి. దీనికి సంబంధించిన అధ్యయనం, ప్రాజెక్టు రూపకల్పనపై హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో కసరత్తు జరుగుతోంది. అదేవిధంగా నగరంలో మరో మూడు ప్రాంతాల్లోనూ రోప్ వే ప్రాజెక్టుల ప్రతిపాదనలు పరిశీలిస్తున్నారు.
ఈ జాబితాలో కారిడార్-1లో భాగంగా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి జూలాజికల్ పార్కుకి వయా ఎంజీబీఎస్ 7.62 కి.మీ పరిధిలో రోప్‌వేను నిర్మించాలి. కారిడార్-2లో ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ నుంచి స్టేట్ అసెంబ్లీ మీదుగా ప్యారడైజ్ మెట్రో స్టేషన్ వరకు పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ విధానం కోసం ప్రతిపాదన రూపొందించారు. కారిడార్-3లో రాయిగిరి నుంచి యాదాద్రి టెంపుల్ టౌన్ (6.2) కి.మీ రోప్‌వే విధానంను రూపొందించారు.
రోప్ వే ఇలా..
నగరంలో పర్యాటక కేంద్రంగా ఉన్న హుస్సేన్‌సాగర్ చుట్టూ రోడ్డు మార్గం ఉంది. దీనికి అదనంగా సాగర్ చుట్టూ ప్రత్యేకంగా 6 కేంద్రాలను గుర్తించి, వాటిని కలుపుతూ ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ హుస్సేన్ సాగర్ తీర ప్రాంతంలోని అందాలను వీక్షించేలా రోప్‌వేను ఏర్పాటు చేయనున్నారు. మెట్రో స్టేషన్ల చుట్టు పక్కల ప్రాంతాలకు ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీని కల్పించేందుకు 4-5 మంది ప్రయాణం చేసేలా సరికొత్తగా పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టంను తీసుకురావాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రోడ్డు మార్గంలో కాకుండా ఆకాశ మార్గంలో ప్రత్యేకంగా మెట్రోరైలు మాదరిగా ట్రాక్స్‌ను నిర్మించి, దానిపై కారు తరహాలో ఉండే ఎలక్ట్రిక్ వాహనం రాకపోకలు సాగించేలా మార్గాలను నిర్మిస్తున్నారు.