Konda Surekha : హనుమకొండ అటవీ శాఖ ఆధ్వర్యంలో హంటర్ రోడ్డు లోని జూ పార్కులో రెండు పులులను, అడవి దున్నలను, అదేవిధంగా ఇతర జంతువులను ప్రజల సందర్శనార్థం ప్రారంభించారు రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, బీసీ సంక్షేమ, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమానికి మేయర్ గుండు సుధారాణి పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఈరోజు నా చేతుల మీదుగా ప్రజల సందర్శనార్థం జూ పార్కులో 4 రకాల జంతువులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అందులో అతి ప్రాముఖ్యంగా హైదరాబాద్ జూ పార్క్ నుండి తీసుకువచ్చిన రెండు పులులను మన పార్కులోకి తీసుకురావడం జరిగిందని ఆమె అన్నారు. హైదరాబాద్ జూ పార్క్ తర్వాత అతిపెద్ద జూ పార్క్ మళ్ళీ మన వరంగల్ లోనే ఉందన్నారు మంత్రి కొండా సురేఖ.
Bus Travels Ticket Rates: ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ..! సంక్రాంతికి ఊరెళ్ళేది ఎలా..?
ప్రస్తుతం మన దగ్గర ఉన్న జూ పార్కు మీడియం స్థానంలో ఉందన్నారు. అగ్రస్థానంలో ఉంచాలన్న ప్రయత్నంలో కేంద్రానికి నివేదికలు పంపించామని, ఆమోదిస్తారు అన్న నమ్మకం కూడా ఉందన్నారు మంత్రి కొండా సురేఖ. రాబోయే రోజుల్లో వైట్ టైగర్ సింహాలను త్వరలోనే ఈ జూకి తీసుకువస్తామని, జూ పార్క్ లో ఉన్న మౌలిక సదుపాయాల నిమిత్తం కోటి రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసామని, జూ పార్క్ అభివృద్ధికి ఇంకా ఎంత ఖర్చైనా కూడా ఇస్తామన్నారు. అందుకోసం కమిషనర్ని నివేదికను కూడా సమర్పించాలని చెప్పామని, ఈ జూ పార్కులో కేవలం జంతువులే కాకుండా మంచి వృక్షాలు కూడా ఉన్నాయని, ఇందులో పనిచేస్తున్న అధికారులు వాటిని కూడా కాపాడుతూ వాటిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారన్నారు.
Digital Arrest: డిజిటల్ అరెస్ట్ స్కామ్ ప్రధాన సూత్రధారి అరెస్ట్