Fire Accident: తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా గుర్తించారు. కాగా.. ఈ ప్రమాదంలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని ఫైల్స్, ఫర్నిచర్, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. అదే విధంగా మంటలు చెలరేగినప్పుడు కార్యాలయం కింద ఉన్న రెండు ఇన్నోవా కార్ల పై అగ్ని కీలలు పడటంతో అవి కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ క్రమంలో.. ఎన్నికల కోడ్ ఉల్లఘించిన పర్యాటక శాఖ ఎండీని మనోహర్ ను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. అంతేకాకుండా.. ఈ ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది.
Read Also: Minister Meruga Nagarjuna: జగన్ ప్రభుత్వంలో దళితుల తలరాతలు మారాయి..
Also Read
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
- Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
- Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
ఇదిలా ఉంటే.. పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రమాద స్థలాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సందర్శించి, పరిశీలించారు. ఈ అగ్ని ప్రమాదం ఉద్దేశపూర్వకంగా చేసినట్లు ఉందని ఆయన ఆరోపించారు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని కీలకమైన ఫైల్స్ ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యాయి.. రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందనే కారణం వల్లే ఈ ప్రమాదాన్ని సృష్టించారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి బాగోతం బట్టబయలు కాకుండా కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల పర్యాటక శాఖ ఎండీ మనోహర్.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊడిగం చేయడం వల్లే ఎన్నికల కమిషన్ ఆయన్ను సస్పెండ్ చేసిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఆయన ప్రమేయం పై విచారణ చేయాలి.. ఈ ఘటనపై హైలెవల్ ఎంక్వయిరీ చేయించాలి… అప్పుడే వాస్తవాలు బయటకి వస్తాయని సీపీఐ నారాయణ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!