తిరుమల వెంకన్న స్వామి భక్తులకు అదిరిపోయే ప్యాకేజీ అందుబాటులోకి వచ్చేసింది. ఈ టూర్ ప్యాకేజీ కేవలం ఒక రోజులో పూర్తవుతుంది. దీనిని తెలంగాణ టూరిజం నిర్వహిస్తోంది. బస్సులోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పెద్దలకు ఈ టూర్ ప్యాకేజీ టిక్కెట్ ధర 3700 రూపాయలు., అలాగే పిల్లలకు 2960 రూపాయలు. ఈ ప్యాకేజీలో తిరుమలలో ఉచితంగా శ్రీవారి శీఘ్ర దర్శనం కూడా ఉంటుంది.
Also Read: Leopard Attack: కళ్లుమూసి తెరిచేలోపు చిరుతకి ఆహారమైన శునకం.. వైరల్ వీడియో..
ఇక ఈ తిరుమల టూర్ ప్యాకేజీ వివరాలు ఒకసారి చూస్తే.. తిరుపతి-తిరుమల టూర్ పేరుతో తెలంగాణ టూరిజం ఓ ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుండి బస్సులో నిర్వహిస్తారు. తిరుపతి, తిరుమల, తిరుచానూరు కేవలం ఒక్కరోజులో కవర్ చేసేలా ఇందులో ప్లాన్ చేసారు. ఈ ప్యాకేజీలో భాగంగా మొదటి రోజు బస్సు హైదరాబాద్ నుండి సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరుమల చేరుకుంటారు. రిఫ్రెష్ అయిన తర్వాత, అక్కడ ఉన్న దేవాలయాలను చూస్తారు. అనంతరం తిరుమలలో శ్రీవారి శీఘ్ర దర్శనం ఉచితంగా ఉంటుంది. దర్శనం తర్వాత తిరుపతి చేరుకుంటారు.
Also Read: Hyderabad Metro: మ్యాచ్ కు వెళ్లి తిరుగుప్రయాణం లేట్ అవుతుందా.. మెట్రో రైళ్లు ఉండగా భయమేల..
ఇక తిరుపతికి చేరుకున్న తర్వాత తిరుగు ప్రయాణం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది. తెలంగాణ టూరిజం టిక్కెట్లను బుక్ చేసుకున్న యాత్రికులందరూ తప్పనిసరిగా తెలంగాణ టూరిజం బస్సులో మాత్రమే ప్రయాణించాలి. తమ కార్లలో వచ్చి దర్శన టిక్కెట్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తే మాత్రం టీటీడీ అధికారులు అందుకు ఒప్పుకోరు. అంతేకాదు మీ డబ్బులు కూడా తిరిగి ఇవ్వబడదు. ఇక పూతివివరాల కోసం తెలంగాణ టూరిజం వెబ్ సైట్ ను సందర్శించాలి.