Telangana Thalli Statue: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన చేసిన తరహాలో రాష్ట్రంలోని ప్రతి కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందు కోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన కొరకు ఒక్కొక్కటి సుమారు రూ.17.50 లక్షల వ్యయంతో మొత్తం రూ.5 కోట్ల 80 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది.. తెలంగాణ తల్లి విగ్రహం ఎత్తు 12…
MLC Kavitha: తెలంగాణ తల్లి చేతులో బతుకమ్మ ఎందుకు? అనే ప్రశ్నకు ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గతంలో ఇందిరా గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ బతుకమ్మ ఎత్తుకొని బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారని కవిత గుర్తు చేశారు.
Ande Sri on Telangana Thalli: తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతం రచించిన అందెశ్రీ తెలంగాణ తల్లి పై పలు ఆసక్తికర కామెంట్స్ చేసారు. గత పాలకులు అన్నట్లుగా అరుస్తున్నట్లుగా తెలంగాణ తల్లి లేదని, అస్తిత్వానికి ప్రాణ ప్రతిష్ట చేసిన రూపం నేటి తెలంగాణ తల్లి రూపం అని ఆయన వాపోయారు. బతుకమ్మ దేవత, ఆ దేవతను, మరో దేవత నెత్తిన కిరీటం పెట్టుకుంటుందా..? మానవ రూపంలో కిరీటం సరైనది కాదని తెలిపారు.…
MLC Kavitha: హస్తం గుర్తుతో ఉన్న తెలంగాణ తల్లి మాకు వద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పంచామృతంతో తెలంగాణ భవన్ లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి అభిషేకం చేశారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాము ఏమీ మార్చలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అనేక పార్టీలు అనేక ప్రతిరూపాలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించాయన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు అధికారికంగా విగ్రహం ఏర్పాటు చేసుకున్నామని ఆయన వెల్లడించారు. ప్రతి ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ప్రతిష్ట ఉత్సవం చేసుకుందామంటూ ప్రజలకు తెలిపారు.
రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగింది
Telangana Assembly Sessions 2024: తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడింది. ఈనెల 16కు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే తెలంగాణ తల్లిపై ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
Komatireddy Venkat Reddy: సోనియా గాంధీ లేకుంటే ఈ జన్మలోనే కాదు మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ ముందుగా సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Bhatti Vikramarka: తెలంగాణ తల్లి స్వరూపం అనేక రూపాల్లో ఉన్నాయని శాసనమండలిలో డిప్యూటీ సీఎ భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ తల్లి ప్రతి రూపాన్ని రూపకల్పన చేసి సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు.
MLC Kavitha: కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం దురదృష్టకరం అని మండిపడ్డారు.