Ande Sri on Telangana Thalli: తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతం రచించిన అందెశ్రీ తెలంగాణ తల్లి పై పలు ఆసక్తికర కామెంట్స్ చేసారు. గత పాలకులు అన్నట్లుగా అరుస్తున్నట్లుగా తెలంగాణ తల్లి లేదని, అస్తిత్వానికి ప్రాణ ప్రతిష్ట చేసిన రూపం నేటి తెలంగాణ తల్లి రూపం అని ఆయన వాపోయారు. బతుకమ్మ దేవత, ఆ దేవతను, మరో దేవత నెత్తిన కిరీటం పెట్టుకుంటుందా..? మానవ రూపంలో కిరీటం సరైనది కాదని తెలిపారు. దేవత రూపంకు కిరీటం పెడతారని, అమ్మ రూపానికి కిరీటం ఉంటుందా..? అని ఆయన ప్రశ్నించారు.
Also Read: C-Section Delivery Back Pain: సి-సెక్షన్ డెలివరీ వెన్నునొప్పికి దారి తీస్తుందా? నిజమెంత?
దేవత రూపం గుడిలో పెట్టి పూజించుకోవాలి.. అమ్మ రూపాన్ని గుండెల్లో పెట్టి ఆరాధించాలని, ఈ భూమిపైన ఏదైనా తల్లి అయితే కిరీటంతో పెట్టుకొని వస్తుందా అని ఆయన భావనను వ్యక్త పరిచారు. అమ్మకు ప్రతిరూపం మానవ దేహాలకు ప్రతిరూపంగా ప్రతి తెలంగాణ నాలుగు కోట్ల మంది గుండెల్లో పెట్టుకునే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశారని, కిరీటాలు దేవతలు పెట్టుకుంటారు.. తల్లికి పట్టాభిషేకం, మన అమ్మ రూపానికి పట్టాభిషేకం జరిగిందని, ఆ విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశారని ఆయన అన్నారు. అద్భుతం జరిగిందని.. అమ్మవారి వద్దకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్న అని అన్నారు.
Also Read: Kerala: లగ్జరీ కార్లను వీడియో తీస్తూ ప్రాణాలు కోల్పోయిన యువకుడు