Komatireddy Venkat Reddy: సోనియా గాంధీ లేకుంటే మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదు
- మన తల్లికి కిరటం లేదు.. మన తల్లికి మెడలో నెక్లేస్ లేదు..
- అచ్చ తెలంగాణ మహిళను పోలి ఉంటే ఆస్తిత్వం దెబ్బతిందా?
- కిరీటం లేదని అమ్మను అమ్మ కాదంటమా? ఇదెక్కడి వాదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy: సోనియా గాంధీ లేకుంటే ఈ జన్మలోనే కాదు మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ ముందుగా సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె పుణ్యానే తెలంగాణ వచ్చిందని అన్నారు. ఈరోజు తెలంగాణ ప్రకటించిన సోనియమ్మకు శుభాకాంక్షలు తెలిపాల్సింది పోయి.. బయట నినాదాలు చేయడం సరైంది కాదన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో అసలు తెలంగాణ పదమే లేదని మంత్రి అన్నారు.
Read also: Atchannaidu: అన్ని శాఖల్లో సమీక్ష నిర్వహించాం.. నిధులు లేవు..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
తెలంగాణ తల్లి అంటే దేవతలా కాదు- మన ఇంట్లో అమ్మలా ఉండాలని తెలిపారు. తెలంగాణ తల్లి రూపంపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదని మంత్రి కోమటి రెడ్డి అన్నారు. తెలంగాణ రాదనుకున్న సమయంలో నాలుగుకోట్లు మంది ప్రజల ఆకాంక్ష నెరవేర్చి తల్లి సోనియా గాంధీ అన్నారు. తెలంగాణ ఇచ్చిన దేవతకు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు చరిత్రలో నిలిచి పోయిన రోజు అన్నారు. మా ముద్దు బిడ్డ శ్రీకాంతాచారి ఎల్బీనగర్ చౌరస్తాలో కాల్చుకుని జై తెలంగాణ అనే నినాదంతో నాలుగు రోజులు మృత్యువుతో పోరాటం చేసి మృతి చెందాడని అసెంబ్లీలో గుర్తు చేసుకున్నారు.
Read also: GV Prakash : డివోర్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైమ్ ఒకే స్టేజ్‌పై మాజీ దంపతులు
ఇవాళ చరిత్రలో నిలిచిపోయే రోజు.. మన ఆస్తిత్వనికి ప్రతికలైన వ్యవసాయం చేసుకునే తల్లిని ఇవ్వాల తెలంగాణ తల్లి రూపంలో గౌరవించుకునే సందర్బం అని మంత్రి అన్నారు. నాకు తెలంగాణ అంటే ఎక్కడ లేని అభిమానం అందుకే 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశా అన్నారు. 3 సంవత్సరాలు మంత్రి పదవిని అనుభవించే అవకాశం ఉన్న రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ అటు వైపు చూడలే అన్నారు. మిలియన్ మార్చ్ లో రబ్బర్ బుల్లెట్స్ తగిలినా వెనక్కి తగ్గలేదన్నారు.
ఇన్ని చేసిన తర్వాత కూడా రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడమే కాదు.. మన తల్లిలాంటి తల్లి లేకుండా కిరీటాలతో, వజ్ర వైడుర్యాలతో ఉన్న తల్లిని తీస్తారా అని కామెంట్స్ బాధాకరం అన్నారు. తెలంగాణ తల్లి అంటే చాకలి ఐలమ్మ లాగో, మన పల్లెటూరి తల్లిలాగో ఉంటుందని భావిస్తే.. ఇదేంటి ఇలా ఉందనిపించిందన్నారు. మన పోరాటాలు, ఉద్యమాలు, శ్రమజీవులకు ప్రతీకలైన వ్యవసాయం చేసుకునే మన తల్లిలాగ ఉండాలని ఇవ్వాల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నూతన తెలంగాణ తల్లిని ఆవిష్కరించిందని తెలిపారు.
Read also: Bollywood : హిందీలో డే-1 కంటే డే- 4 ఎక్కువ రాబట్టిన పుష్ప -2
తెలంగాణ అంటే ఆత్మగౌరవం, స్వేచ్చా, చైతన్యం.. కానీ, గత పదేండ్లలో జరిగిన సంఘటనలు మనకు మాయని మచ్చల్లా వెంటాడుతున్నయన్నారు. అందుకే, ఇప్పుడు తెలంగాణ అస్థిత్వాన్ని సరైన స్థానంలో నిలబెట్టాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. ఈ క్రమంలోనే మన అస్థిత్వానికి ప్రతీకలు, నిజాయితీకి నిలువుటద్దాలు, కష్టానికి ప్రతిరూపాలైన వ్యవసాయం చేసుకునే స్త్రీమూర్తిని.. పోలిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించామన్నారు. తెలంగాణ తల్లి నమూన విడుదల చేయగానే.. తలపై కిరీటం లేదు, మెడలో నెక్లెస్ లేదు, వంటికి పట్టుచీర లేదు.. తెలంగాణ అస్థిత్వాన్ని ఆగం చేస్తున్నరని కొందరు కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
Read also: Bhatti Vikramarka: తెలంగాణ తల్లి విగ్రహం.. మార్చకుండా చట్టం..
మన తల్లికి కిరటం లేదు.. మన తల్లికి మెడలో నెక్లేస్ లేదు.. అచ్చ తెలంగాణ మహిళను పోలి ఉంటే ఆస్తిత్వం దెబ్బతిందా? అని ప్రశ్నించారు. కిరీటం లేదని అమ్మను అమ్మ కాదంటమా? ఇదెక్కడి వాదన అని అసెంబ్లీలో కోమటి రెడ్డి మండిపడ్డారు. మంత్రిగా.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకునిగా.. నేను వాళ్లకు ఒక మాట చెప్పదల్చుకున్న అన్నారు. రాజకీయ ఎదుగుదల కోసం తెలంగాణ పేరు తొలగించుకునే అవకాశవాద పార్టీ కాదు కాంగ్రెస్ అన్నారు. రాజకీయాల కోసం తెలంగాణను తీసేసి బీఆర్ఎస్ అని పెట్టుకున్నవాళ్లకి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. ఈ రాష్ట్రంలో పార్టీ పేరుకు ముందు తెలంగాణ అని రాసుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు.
Illegal Sand Mining: రాజమండ్రిలో అక్రమ ఇసుక తవ్వకాలు.. 18 పడవలు సీజ్
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు