Telangana Thalli Statue: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన చేసిన తరహాలో రాష్ట్రంలోని ప్రతి కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందు కోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన కొరకు ఒక్కొక్కటి సుమారు రూ.17.50 లక్షల వ్యయంతో మొత్తం రూ.5 కోట్ల 80 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది.. తెలంగాణ తల్లి విగ్రహం ఎత్తు 12 అడుగులు, క్రింద ఉన్న దిమ్మె 6 అడుగులు మొత్తం కలిపి భూమిపై నుంచి 18 అడుగులు ఉండనుంది. తెలంగాణ తల్లి రూపము సాంప్రదాయ పల్లెటూరి మహిళా రైతుగా, స్త్రీ మూర్తిగా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు.
READ MORE: Padmavathi Temple: అనధికారికంగా ఆలయంలో విధులు.. నేడు ఉన్నతాధికారులకు విజిలెన్స్ రిపొర్టు!
పసుపుపచ్చ బంగారు అంచుతో కూడిన ఆకుపచ్చ చీరలో ఉండి తెలంగాణ సాంప్రదాయ పంటలు మొక్కజొన్న, గోధుమ, సజ్జ కంకులు ఎడమ చేతిలో ఏర్పాటు చేశారు. నుదుటిపై ఎర్రని బొట్టు, కాళ్లకు కడియాలు, ముక్కుపుడక, చెవులకు కమ్మలు, మట్టి గాజులు, మెడలో గుండు పూసల హారం కలిగి, చిరునవ్వుతో కూడిన విగ్రహాన్ని ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా రూపకల్పన చేశారు.. కలెక్టరేట్ ఆవరణలో ప్రతిష్టించబోయే తెలంగాణ తల్లి విగ్రహం, వివిధ పనులపై అక్కడికి వెళ్లే ప్రజలను ఆకట్టుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9వ తారీకున తెలంగాణ తల్లి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఈ కార్యక్రమాన్ని జరపాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 27 కలెక్టరేట్ల ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా, మంత్రులతో కలసి ప్రారంభోత్సవం చేస్తారు.
READ MORE: Rajya Sabha: నేడు రాజ్యసభలో ‘వందేమాతరం’పై చర్చ ప్రారంభించనున్న జేపీ నడ్డా