MLC Kavitha: తెలంగాణ తల్లి చేతులో బతుకమ్మ ఎందుకు? అనే ప్రశ్నకు ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గతంలో ఇందిరా గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ బతుకమ్మ ఎత్తుకొని బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారని కవిత గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ తల్లి చేతులో బతుకమ్మ ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లకి మాత్రం తెలంగాణ పండుగలు గుర్తుకు వస్తాయని కవిత మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు, పరిణామాలు పై రేపు సోమజిగూడా ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
Read also: Priyanka Gandhi: రాజ్యాంగం అంటే సంఘ్‌బుక్ కాదు.. సంవిధాన్!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రకరకాలుగా తెలంగాణ పండుగలను అవమానించారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. బతుకమ్మ బోనాలను రాష్ట్ర పండుగగా కేసీఆర్ ప్రకటించారని కవిత గుర్తుచేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒక్క మాత కల్లోలం కూడా లేకుండా పాలన చేశామన్నారు. చార్మినార్, కాకతీయ కళా తోరణం తీసివేయాలని ముఖ్యమంత్రి ఆలోచన చేసి వెనక్కి తగ్గారని కవిత అన్నారు. తెలంగాణ విజయోత్సవాల్లో ఒక్క తెలంగాణ పాట కూడా పడలేదని మండిపడ్డారు. గాంధీ విగ్రహాలు గాంధీపై ప్రేమతో పెట్టుకుంటామన్నారు. ఎవరి విగ్రహం అయిన ప్రేమతో పెట్టుకుంటామని తెలిపారు.
Read also: Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టుపై కేటీఆర్ సంచలన ట్వీట్
శివాజీ విగ్రహం జీవో ఇచ్చారని పెట్టుకున్నారా? అని ప్రశ్నించారు. భారత మాత విగ్రహానికి కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. బ్రిటీష్ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా గెజిట్ ఇవ్వలేదన్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాంగ్రెస్‌కి ముఖ్యం కాదన్నారు. కాంగ్రెస్ వాదులే కానీ తెలంగాణ వాదులు కాదన్నారు. ఇందిరా గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ ,రాహుల్ గాంధీ బతుకమ్మ ఎత్తుకొని బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారని గుర్తు చేశారు. ఓట్లకు మాత్రం తెలంగాణ పండుగలు గుర్తుకు వస్తాయని అన్నారు. తెలంగాణ తల్లి చేతులో బతుకమ్మ ఎందుకు అంటున్నారని కవిత మండిపడ్డారు.
Read also: Allu Arjun Arrest : బన్నీ అరెస్ట్ కేసులో అదే జరిగితే అంతే..?
ముఖ్యమంత్రికి ఒక ప్రశ్న అడుగుతున్నా? గతంలో రాష్ట్ర పండుగ బతుకమ్మ అని జోవో ఇచ్చారని గుర్తు చేశారు. బతుకమ్మని అవమానించేలా మంత్రులు నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మరి ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అని ప్రశ్నించారు. ఊరు ఊరూలో తెలంగాణ విగ్రహం నిలబెట్టు కుంటామని కవిత అన్నారు. తెలంగాణలో పిరికి ముఖ్యమంత్రి ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులు పెడుతామని గెజిట్ ఇవ్వడం ఏంది..? అని మండిపడ్డారు. నిర్బంధంగా తెలంగాణ విగ్రహం తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Swarnandhra @ 2047 Vision Document: స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ..
ఫార్ములా ఈ రేసింగ్ కేసుపై మీడియా అడిగిన ప్రశ్నకు కవిత ఏమన్నారంటే. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందన్నారు. మేము ఎలాంటి తప్పు చేయలేదని ప్రజలకు తెలుసన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై కేసులు పెడుతున్నారని తెలిపారు. పిరికి ప్రభుత్వం కాబట్టే కేసులు పెడుతున్నారని కవిత అన్నారు.
Allu Arjun : అల్లు అర్జున్ అరెస్ట్, నాన్ బెయిలబుల్ కేసు నమోదు