ఫ్యూఛర్ సిటీ... దేశంలోని నగరాలతోకాదు.. ప్రపంచ నగరాలతో పోటీ పడేవిధంగా తీర్చిదిద్దేలనే లక్ష్యంతో దార్శనిక ప్రణాళిక రెడీ అయింది. టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిశ్రమలు, సాంకేతిక, అంతరిక్ష, వైమానిక, రక్షణ, పర్యాటక, సెమీకండక్లర్ల పరిశ్రమలను స్థాపించ బోతున్నారు. ఇందుకు సంబంధించి పారిశ్రామిక దిగ్గజాలకు ప్రోత్సాహాలను అందించి.. పెట్టుబడులు సాధించారు.
Anand Mahindra : భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత వైభవంగా నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ విజయవంతంగా ముగిసింది. ఈ అంతర్జాతీయ స్థాయి సమ్మిట్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా పాల్గొని సీఎం రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అభివృద్ధి దిశ, విజన్ డాక్యుమెంట్ ఆయనను బాగా ఆకట్టుకుందని వెల్లడించారు. సమ్మిట్ వేదికపై మాట్లాడిన ఆనంద్ మహీంద్రా… టెక్నాలజీ ఎంత వేగంగా ఎదిగినా, డిజిటలైజేషన్,…
Telangana Rising Global Summit : తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో, పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8వ తేదీన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ను నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేయనున్నారు. ఈ కీలకమైన సదస్సును రాజకీయాలకు అతీతంగా జరపాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా, సమ్మిట్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,…
ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్న స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్.. మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి రద్దు అయినట్లు ప్రకటించింది. గత కొన్ని రోజులుగా నడుస్తున్న సస్పెన్స్‌కు మంధాన ఫుల్ స్టాప్ పెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి రద్దు అయిన విషయాన్ని ప్రకటించింది. పెళ్లి రద్దు గురించి ప్రకటించిన కొంతసేపటికే.. ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. నవంబర్ 23న ఈ జంటకు వివాహం జరగాల్సి ఉంది. అయితే, స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానాకి…
తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్దమైంది. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత అద్భుతంగా ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 44కు పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవాప్తంగా పేరెన్నికగల కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నారు. ఒక్క…
Telangana Rising Global Summit : హైదరాబాద్‌లో జరగనున్న రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్‌కు పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. సమ్మిట్‌ను సురక్షితంగా నిర్వహించేందుకు దాదాపు 6 వేల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 14 నుంచి సమ్మిట్ ప్రధాన వేదిక వరకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నామని వెల్లడించారు. సమ్మిట్ వేదికను ఇప్పటికే…
గుడ్ న్యూస్.. శబరిమల ప్రసాదం నేరుగా మీ ఇంటికే.. ఎలా బుక్ చేసుకోవాలంటే..? శబరిమలలో మకరవిళక్కు పూజా సీజన్ ప్రారంభం కావడంతో రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. అయ్యప్ప భక్తుల రద్దీని నియంత్రించడానికి ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వివిధ చర్యలు తీసుకుంటోంది. అలాగే భక్తుల రద్దీకి అనుగుణంగా స్పాట్ బుకింగ్ టోకెన్లను తగ్గిస్తూ, పెంచుతూ వస్తోంది. ఇకపోతే కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో అరవణ పాయసం, అప్పం ప్రసాదంగా ఇస్తారు. అయితే ఇప్పుడు ఈ అయ్యప్ప స్వామి…
భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 వ తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ సజావుగా సాగేందుకు అవసరమైన విద్యుత్ సరఫరా అందించేందుకు గాను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ విస్తృత ఏర్పాట్లు చేసిందని ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ, ఐఏఎస్ తెలిపారు. 33 /11 కేవీ మీర్ ఖాన్ పేట్ సబ్ స్టేషన్ నుండి సదస్సు జరిగే ప్రాంతానికి ప్రత్యేకంగా రెండు కిలో మీటర్ల నిడివి కలిగిన డబుల్ సర్క్యూట్…