వరంగల్ జిల్లాలో ఘోర ఘటన చోటు చేసుకుంది. పెళ్లి నిశ్చయమై.. తెల్లారితే నిశ్చితార్థం అనగా మృత్యువు ఊహించని విధంగా వర్షాల రూపంలో ఆ యువకున్ని మింగేసింది. ఈ ప్రమాదంలో యువకుడితో పాటు మరో వ్యక్తి మృతి చెందగా.. తల్లికి తీవ్రగాయాలయ్యాయి. భారీ వర్షాల కారణంగా వరంగల్‌లోని మండి బజారులో ఓ పాత భవనం కూలడంతో..ఇద్దరు మృతి చెందారు. వరంగల్ నగరంలోని మండి బజార్ మెయిన్ రోడ్ లో గ్రాంపాస్ బేకరీ పురాతనమైన బిల్డింగ్ కూలి పక్కనే ఉన్న…
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నిన్న (శుక్రవారం) ఉదయం నుంచి రాత్రి వరకు భాగ్యనగరం సహా పలు జిల్లాల్లో భారీగా వానలు పడ్డాయి. నగరవాసులతంగా ఇంకా ఐదురోజుల పాటు అప్రమత్తంగా వుండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్రేటర్ నగరంతో పాటు మహబూబ్ నగర్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రెడ్డ అలర్ట్ ఉంటుందని ప్రకటించింది. కాగా.. 4 రోజులు అక్కడక్కడా కుంభవృష్టి కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న వెల్లడించారు.…
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మళ్లీ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తాయని తెలియని కూలీలు ఇవాళ ఉదయం పనులకు వెళ్లారు. ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందపురం-జి.కొత్తపల్లి మధ్యలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న పాలేరు వాగులో 23 మంది వ్యవసాయ కూలీలు చిక్కుకున్నారు.
తెలంగాణలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్‌కుమార్, నీటి పారుదలశాఖ అధికారులు, ఈఎన్సీలు, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రెండు రోజులు నుంచి వర్షాలు తగ్గాయని అనుకునేంతలోపే మళ్లీ తెలుగు రాష్ట్రాలపై మరోసారి వరుణుడు గర్జించనున్నాడు వర్షం నగరాన్ని ముంచెత్తింది. షియర్ జోన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు తెలంగాణ, కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీగా వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ, రేపు హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు హైదరాబాద్‌లో అక్కడక్కడా భారీ…
రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. వరణుడు తెలంగాణను కనకరించడంలేదు. రెండు రోజులు సాధారణంగా జల్లులు కురవడంతో.. తగ్గుముఖం పడ్డాయి అనుకున్న క్రమంలో వానలు మళ్ళీ మొదలయ్యాయి. అయితే నేడు పలు చోట్లు భారీ వానలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రజలకు చేదు వార్త తెలిపింది. ఈనేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని తెలిపింది. అవసరమైతే తప్పా బయటకు వెళ్లకూడదని ప్రకటించింది. read also: Corona Cases: దేశంలో…
తెలంగాణలో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి.. కొన్ని ఏళ్ల తర్వాత జులై నెలలో భారీ స్థాయిలో వరదలు ముంచెతాయి.. గోదావరి పరిసర ప్రాంతాలు ఇంకా జల దిగ్భందంలోనే ఉన్నాయి.. భద్రాచలం దగ్గర పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.. అయితే, ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికలు జారీ చేసింది.. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ మరియు వాతావరణ హెచ్చరికలను ఓ సారి పరిశీలిస్తే.. నిన్న ఒడిశా…