హైదరాబాద్ నగరంలో భారీ వర్షం దంచికొడుతుంది. సోమవారం ఉదయం నుంచి వాతావరణంలో మార్పులు కనిపించింది. కాస్త ఎండ నగరాన్ని తాకిన ఉదయం 10.45 గంటల నుంచి వర్షం నగరాన్ని ముంచెత్తింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఎస్‌ఆర్ నగర్, కూకట్‌పల్లిలో కుండపోత వర్షం కురుస్తోంది. గండిపేట, బండ్లగూడ, రాజేంద్రనగర్, గచ్చిబౌలి,షేక్‌పేట, మణికొండ, బషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, కవాడిగూడ, దోమల్‌గూడ, భోలక్‌పూర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, జవహర్ నగర్, గాంధీనగర్, షేక్‌పేట, రాయదుర్గం, రాజేంద్రనగర్,…
వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో మూసీ నదిలో వరద ఉధృతి పెరిగింది.. శంకర్‌పల్లి సహా మిగత ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుంది.. భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో 6 ఫీట్ల మేరా 12 గేట్లు ఎత్తి నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇక, దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు.. నార్సింగి నుండి అప్పా వెళ్లే దారిని పూర్తిగా మూసి వేశారు…
తెలంగాణను ఇప్పటికే భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి.. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడినా.. మరికొన్ని జిల్లాల్లో భారీ నష్టాన్ని మిగిల్చాయి.. అయితే, మరో మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయిన వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.. నిన్నటి ఆవర్తనం ఇవాళ కూడా ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని.. పైకి వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపుకి వంపు…
తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని ఏళ్ల తర్వాత జులై నెలలో భారీ స్థాయిలో వరదలు ముంచెత్తాయి. గోదావరి పరిసర ప్రాంతాలు ఇంకా జల దిగ్భందంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.