తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువ రాష్ట్రాల్లో ఎడతెలిరి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, ప్రాజెక్టు, చెరువులు నిండిపోయాయి. భారీ వానలకు మరోవైపు గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. రికార్డ్ స్థాయిలో నీరు భద్రాచలం వద్ద చేరుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. రికార్డ్ స్థాయిలో నీరు భద్రాచలం వద్ద చేరుతున్న నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు తెలంగాణ గవర్నర్ తమిళసై రేపు భద్రాచలంలో పర్యటించనున్నారు. గోదావరి వరద…
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వానలకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. ఈనేపథ్యంలో. సీఎం కేసీఆర్ రేపు (ఆదివారం) ఉదయం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే కడెం నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో.. సీఎం కేసీఆర్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పాల్గొననున్నారు. రేపు జరిగే ఏరియల్ సర్వేలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక కార్యక్రమాలను సీఎం నేరుగా పర్యవేక్షించనున్నారు.…
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షంతో పాటు, ఈ రోజు అత్యంత భారీ వర్షాలు అక్క డక్కడ వచ్చే అవకాశం ఉందని.. ఎల్లుండి భారీ వర్షాలు అక్క డక్కడ పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
తెలంగాణ రాష్ట్రంలో కుండపోతగా వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో.. ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌లో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. గతంలో మునుపెన్నడూ లేని విధంగా.. 64 ఏళ్ల రికార్డ్‌ను బద్దలుకొడుతూ వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. నీటి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు. 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో.. అధికారులు 17 గేట్లు ఎత్తి మూడు లక్షల క్యూసెక్కుల నీరుని…
తెలంగాణలోకి బుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది.. మొన్న రాత్రి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవగా.. మంగళవారం పరిస్థితి భిన్నంగా ఉంది.. పగటిపూట ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగిపోయాయి.. అయితే, రాత్రి నుంచి మళ్లీ పరిస్థితి మారిపోయింది.. అక్కడక్క వర్షం కురిసింది.. మరోవైపు, ఇక నుంచి వర్షాలు దంచికొట్టే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉదయం నుంచే హైదరాబాద్ సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు…
నైరుతి రుతుపవనాలు కేరళను మూడు రోజుల ముందుగానే తాకాయి. అయితే రుతుపవనాల విస్తరణ మాత్రం నెమ్మదిగా జరుగుతోంది. అయితే తాజాగా వాతావరణ శాఖ తెలంగాణకు రానున్న మూడు రోజుల పాటు వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం వెల్లడించారు. జూన్ 6 నుంచి పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్న ఆయన.. హైదరాబాద్‌లో ఇవాళ ఆకాశం…
తెలంగాణలో ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి.. చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది.. ఇదే సమయంలో.. మూడు రోజుల పాటు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. రాష్ట్రంలో కొన్నిచోట్ల ఆదివారం నుంచి మంగళవారం వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.. అంతేకాదు.. అకాల వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.. కాగా, ఇప్పటికే తెలంగాణలో కురిసిన వర్షాలతో…
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక నుంచి ఒడిశా వరకు ఉపితల ఆవర్తనం వ్యాపించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికీ నిన్న…