Telangana Governor Tamilisai Soundararajan Visit Flood Areas in Bhadradri Kothagudem District.
తెలంగాణలో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అయితే భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో.. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళసై సౌందర రాజన్ పర్యటించనున్నారు. న్యూ ఢిల్లీలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వీడ్కోలు విందుకు హాజరు కావాల్సి ఉన్న రాష్ట్రంలోని తీవ్ర వరద పరిస్థితి నేపథ్యంలో ఢిల్లీ పర్యటనను గవర్నర్ రద్దు చేసుకున్నారు. భద్రాచలం, చుట్టుపక్కల ప్రాంతాలలో వరద బాధిత ప్రజల దుస్థితిని చూసి చలించి న్యూఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్న తమిళిసై సౌందరరాజన్.. శనివారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కి ఆదివారం ఉదయం మణుగూరు చేరుకోనున్నారు.
KCR Warangal Tour : సాయంత్రం వరద పరిస్థితులపై సమీక్ష
షెల్టర్ క్యాంపులు, ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వైద్య, ఇతర సహాయక చర్యలను అందించాలని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (IRCS), ఈఎస్‌ఐసీ( ESIC) మెడికల్ కాలేజీ బృందాలను కూడా గవర్నర్ ఆదేశించారు. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో షెల్టర్ క్యాంపులను సందర్శించి, ప్రజలతో గవర్నర్ మమేకమవనున్నారు. ఐఆర్‌సీఎస్, ఇతర దాతృత్వ సంస్థలు, వ్యక్తుల నుండి సహాయ సామాగ్రిని సమీకరించనున్న గవర్నర్… ప్రజలు, ఇతర సంస్థలను ఉదారంగా విరాళాలు ఇవ్వడం, సహాయక చర్యలు చేపట్టడం అవసరమైన వారికి మానవతా సహాయం అందించడం ద్వారా వరద బాధిత ప్రజలకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.