తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వర్షం పడిందంటే సెంటీమీటర్లలో ఉంటుంది.. ఈ మధ్య హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో వానలు దంచికొట్టాయి.. ఇప్పుడు మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.. రేపటి నుంచి అంటే.. మంగళవారం నుంచి మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు…
Heavy Rains In Hyderabad City: కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకున్న వరుణుడు.. మరోసారి విజృంభించాడు. హైదరాబాద్ నగరంలో తాండవం చేశాడు. బంజారాహిల్స్, లక్డికపూల్, అసెంబ్లీ, సచివాలయం, నాంపల్లి, కోఠి, సికింద్రాబాద్, మాధాపూర్, అమీర్‌పేట, ఎస్సార్ నగర్, బేగంపేట, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, గోషామహల్, అబిడ్స్, సుల్తాన్ బజార్, అంబర్పేట్, బషీర్‌బాగ్, అఫ్జల్ గంజ్, రాజేంద్రనగర్, అత్తాపూర్, మణికొండ, నార్సింగీ, మెహదీపట్నం, కార్వాన్, మాసబ్ ట్యాంక్, మల్లేపల్లి తదితర ప్రాంతాల్లో వరుణుడు చెలరేగిపోయాడు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడం,…
Telangana Weather: హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు రెండు రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని పేర్కొంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల నేడు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షం చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు రాష్ట్రం వైపుకు కింది స్థాయిలోని గాలులు వాయువ్య దిశ…
తెలంగాణలో వర్షాలు మళ్లీ దంచికొడుతున్నాయి.. మునుపెన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో అన్నట్టుగా.. ఇప్పుడు దాదాపు 115 ఏళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టేశాయి.. జులై, ఆగస్టుతో పాటు సెప్టెంబర్‌లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.. జులై నెలలో కురిసిన వర్షాలకు ఊళ్లకు ఊళ్లే కొన్ని వారాల పాటు వరద ముంపునకు గురికాగా.. పూర్తిస్థాయిలో తేరుకోకముందే మరోసారి వర్షాలు అందుకున్నాయి.. దీంతో, మళ్లీ వరద ముంపు పెరుగుతోంది. జులై నెలలో రికార్డు స్థాయిలో వర్షాలు కురవగా.. ఆగస్టులో…
కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన వర్షాలు మళ్లీ దంచికొడుతున్నాయి.. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో గత రెండు రోజులుగా.. కాస్త గ్యాప్ ఇచ్చి.. ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి.. వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.. వాహనదారులు.. ఓ వైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్ జామ్‌లతో నరకం చూస్తున్నారు.. అయితే, తెలంగాణలో వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు..…
బంగాళాఖాతంలో ఈనెల 19న (రేపు) అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. భారతదేశ నైరుతి ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనేపథ్యంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఈవానలకు ఆదిలాబాద్,…