తెలుగు రాష్ట్రాల్లో ‘మొంథా’ తుఫాన్ బీభత్సం సృష్టిచింది.. తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసాయి. దీంతో వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వరదలతో రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. Read Also:Dimpleplasty: సొట్ట బుగ్గల కోసం ఓ అమ్మాయి.. ఎంత పని చేసిందో తెలుసా.. అయితే వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామ శివారులో…
Montha Effect : మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని అనేక జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరంగల్–ఖమ్మం ప్రధాన రహదారి మీదుగా వరద నీరు భారీగా చేరింది. ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఆ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. వరంగల్ నగరంలోని శివనగర్, మైసయ్య నగర్, ఎన్‌ఎన్ నగర్, లక్ష్మీగణపతి కాలనీ, విశ్వనాథ్ కాలనీ, కాశీబుగ్గ, వివేకానంద కాలనీ, స్టేషన్ రోడ్,…
Telangana : మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సిద్దిపేట, హన్మకొండ, ములుగు జిల్లాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నదులు, వాగులు పొంగిప్రవహిస్తున్నాయి. రహదారులపై నీరు చేరి రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్లు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు సంయుక్తంగా సమీక్ష నిర్వహించి, వర్షపాతం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రేపు (గురువారం) సిద్దిపేట, హన్మకొండ, ములుగు…
తెలుగు రాష్ట్రాల్లో ‘మొంథా’ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఏపీపై ప్రభావం చూపుతోంది. తుఫాన్ ప్రభావంతో అన్ని జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వరదలతో రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. వరద నీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Montha Cyclone: మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్ ప్రభావం రెండో రోజు సైతం రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అనేక రైళ్లు రద్దు చేశారు.మొత్తం 122 రైళ్లు పూర్తిగా రద్దు చేయగా.. 14 రైళ్లు దారి మళ్లించారు. 28 రైళ్లు రీ-షెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. డోర్నకల్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ట్రాక్‌పై భారీగా…
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది. అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రాగల 12 గంటల్లో (గురువారం తెల్లవారుజాము) వాయుగుండంగా ఏర్పడుతుందని పేర్కొంది. శుక్రవారం (అక్టోబర్ 3) దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తాల మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. Also Read: Anirudh Reddy vs KTR: వసూళ్లు, కమీషన్స్, కబ్జాల కోసం కాదు.. కేటీఆర్‌కు జడ్చర్ల ఎమ్మెల్యే…