దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, హీరో మోటార్ కార్ప్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సీఎం పిలుపునిచ్చారు.
Harish Rao: సిద్దిపేటలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనుల కోసం ప్రజలు ఎన్ని సార్లు దరఖాస్తులు పెట్టాలని ప్రశ్నించారు. దరఖాస్తు పెట్టినప్పుడల్లా 40 రూపాయల వరకు ఖర్చు అవుతుందని, దరఖాస్తుల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, గతంలో ఇచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయకుండా మూలకు పడేశారని, దరఖాస్తుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అబద్ధాల…
MLC Kavitha: యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపై, ఇళ్లపై దాడి చేసే వారిని కవిత హెచ్చరించారు. ‘మా పార్టీ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదు. 60 లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం బీఆర్ఎస్ పార్టీ అని ఆమె పేర్కొన్నారు. ‘60 లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసే వైఖరి మానుకోవాలని హితవు పలికారు. ఉదయం లేచిన దగ్గర నుంచి కేటీఆర్ తిట్ల దండకం అందుకుంటున్నారని ఆరోపించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ ఎమ్మెల్యేలు లంచ్ భేటీ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది.
Etela Rajender : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారంలో ఉద్రిక్తత నెలకొంది. పేదల భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని ఏకశిలానగర్‌లో జరిగింది, దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. బాధితులు, రియల్ వ్యాపారులు పేదల భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారన్న విషయాన్ని ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఈటల,…
Minister Seethakka : ములుగు జిల్లాలో మంత్రి సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకాలు ధ్వంసం ఘటనలు కలకలం రేపుతున్నాయి. మొన్న కొండాయి గ్రామంలో, నేడు అబ్బాయిగూడెంలో మంత్రి సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకాలు ధ్వంసం చేశారు గుర్తు తెలియని దుండగులు. వరుస ఘటనలతో అధికార పార్టీ లో అయోమయం నెలకొంది. 10 నెలలు గడుస్తున్నా బ్రిడ్జి పనులు మొదలు కాలేదని, ఏటూరునాగారం మండలం దొడ్ల-మల్యాల గ్రామాల మధ్య జంపన్నవాగుపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క నూతన బ్రిడ్జి కోసం…
BRS : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే. తారక రామారావు (కేటీఆర్) నేతృత్వంలో నల్గొండలో నిర్వహించ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో రాజకీయ వాతావరణంలో కలకలం రేగింది. జనవరి 21న జరగాల్సిన ఈ మహాధర్నాకు చివరి నిమిషంలో అనుమతి రద్దయింది. పోలీసుల నిర్ణయంతో బీఆర్ఎస్ నాయకత్వం హైకోర్టును ఆశ్రయించడంతో పాటు ధర్నాను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించడానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాట్లు…
Madhavaram Krishna Rao : గడిచిన సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ అభివృద్ధిని అటుకెక్కించి ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టి కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్ పల్లి కె.పి.హెచ్.బి కాలనీలోని ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న వేణుగోపాల స్వామి ఆలయ మండపాన్ని హౌసింగ్ బోర్డ్ అధికారులు సీజ్ చేసిన విషయాన్ని తెలుసుకొని స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు తో కలిపి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వేణుగోపాల…
Etela Rajender : నా రాజకీయ జీవితంలో ఇంత అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని, ఆర్థిక శాఖలో కమిషన్ లేకుండా ఒక్క బిల్లు మంజూరు చేయడం లేదన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. 7 నుంచి 10 శాతం కమిషన్ లేనిదే చిన్న బిల్లు కూడా ఇవ్వడం లేదని, ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా దుకాణాలు ఓపెన్ చేశారన్నారు. మళ్లీ దొరుకుతదొ దొరకదొ అన్నట్లు దోచుకుంటున్న ప్రభుత్వం ఇది అని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపిని…