Guvvala Balaraju : భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీకి పెద్ద షాక్‌గా మాజీ ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు డా. గువ్వల బాలరాజు రాజీనామా చేశారు. సోమవారం తన పదవులు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం సులభం కాదని, ముఖ్యంగా ఐక్యత అవసరమైన ఈ సమయంలో బాధతో తీసుకున్న నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. Windows in shopping Mall: షాపింగ్ మాల్స్ లో కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా?..…
MLC Kavitha : ధర్నా చౌక్ దగ్గర ఎమ్మెల్సీ కవిత చేపట్టిన నిరాహార దీక్ష ముగిసింది. అయితే.. పోలీసులు ఒక రోజుకు మాత్రమే దీక్షకు అనుమతి ఇవ్వడంతో.. జాగృతి సభ్యులు కోర్టును ఆశ్రయించించారు. అయితే.. 72 గంటలు దీక్షకు అనుమతి ఇవ్వలేమని కోర్టు తెలపడంతో ఎమ్మెల్సీ కవిత దీక్షను విరమించారు. అయితే.. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కోర్టు తీర్పును గౌరవిస్తూ.. దీక్షను ఇంతటితో ముగిస్తున్నానన్నారు. పోరాటం ఆగదు.. అనేక రూపాల్లో పోరాటం చేస్తామని ఆమె…
MLC Kavitha : హైదరాబాద్ ధర్నాచౌక్‌లో కొనసాగుతున్న MLC కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్ష మంగళవారం డ్రామాటిక్ మలుపు తిరిగింది. కోర్టు అనుమతి నిరాకరించడంతో, పోలీసులు కవితను దీక్షా స్థలం నుంచి ఇంటికి తరలించే ఏర్పాట్లు ప్రారంభించారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే, పోలీసులు మరోసారి కవితను దీక్ష విరమించాలని కోరారు. అయితే కవిత అనుచరులు, జాగృతి కార్యకర్తలు దీక్ష కొనసాగించాలని పట్టుబట్టారు. పోలీసులు వారిని అడ్డుకుంటూ, వర్షం తగ్గిన వెంటనే కవితను లిఫ్ట్…
KCR : సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కీలక సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై కమిషన్ నివేదిక బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆరు గంటలుగా కొనసాగుతున్న ఈ భేటీలో హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వంటి పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కాళేశ్వరం అంశంపై పార్టీ తరఫున తీసుకోవాల్సిన…
Jagadish Reddy : బీఆర్ఎస్లో నెలకొన్న విభేదాలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఎన్టీవీతో మాట్లాడిన ఆయన, ఇటీవల ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు సమాధానమిస్తూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. “నా ఉద్యమ ప్రస్థానంపై ఉన్న జ్ఞానానికి కవితకు జోహార్లు” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన ఆయన, “కేసీఆర్‌కు బద్ధ శత్రువులైన రేవంత్ రెడ్డి, రాధాకృష్ణ ఏమి మాట్లాడుతున్నారో అదే పదాలను కవిత వాడుతున్నారు” అని విమర్శించారు. “వాళ్లు ఉపయోగించిన పదాలను కవిత వల్లెవేస్తున్నారు” అంటూ…
BRS : ఎర్రవల్లి ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌లతో కలిసి కేసీఆర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన నివేదిక, రాబోయే స్థానిక ఎన్నికల వ్యూహాలపై ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇటీవలి కాలంలో ఎర్రవల్లిలో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ తరచుగా భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పార్టీ అనుసరించాల్సిన భవిష్యత్తు…
Uttam Kumar Reddy : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని స్పష్టంచేస్తూ, “మా రిపోర్టుల వల్లే ఈ ప్రాజెక్ట్ ఆగింది, మా రిపోర్టర్ల కృషితోనే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను ఆపింది” అని ఆయన పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టు రాష్ట్రానికి అనర్ధం తెస్తుందని హెచ్చరిస్తూ, “దాన్ని ఆపడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతటి…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి బీఆర్ఎస్లోని ఒక కీలక నేతనే కారణమని ఆమె ఆరోపించారు. జగదీష్‌రెడ్డి పేరు ప్రస్తావించకుండానే BRS లిల్లీపుట్ అంటూ కవిత ఫైర్ అయ్యారు. నల్గొండలో బీఆర్ఎస్ను నాశనం చేసిన లిల్లీపుట్ అన్న కవిత.. చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు ఒక్కడే గెలిచాడు అని వ్యాఖ్యానించారు. తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖను బహిర్గతం చేయడం…
MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత ఎన్టీవీతో క్వశ్చన్ అవర్‌లో మాట్లాడుతూ కీలక విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తప్పుల తడక ఉన్నప్పటికీ బీసీ కులగణన జరిగిందని, ముస్లింలు, బీసీలు, కలిపి 56 శాతం ఉండాలి.. కానీ రేవంత్ రెడ్డి 42 శాతమే ఇచ్చారన్నారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్లు అమలు చేయవచ్చని, సెప్టెంబర్ 30 వరకూ ఉన్న డెడ్‌లైన్‌లోపు ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్లు అమలు…
MLC Kavitha : ఎన్టీవీ క్వశ్చన్ అవర్‌లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బీసీలంటే నాలుగైదు కులాలు మాత్రమే కాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైనా అంతర్గతంగానే మాట్లాడాలని, బీసీలకోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు ఎమ్మెల్సీ కవిత. వృత్తిపనులకు చేయూత ఇచ్చే కార్యక్రమాలు చేశామని, రిజర్వేషన్లపై 50 శాతం క్యాప్ ఎత్తేసిన తర్వాత బీసీ ఉద్యమం ఊపందుకుందన్నారు కవిత. Dimple Hayathi: శారీలో చందమామలా.. డింపుల్ పిక్స్ చూడాల్సిందే! మహిళల విషయాలు మహిళలే మాట్లాడాలి అంటే సమస్యలు…