తెలంగాణలో చాలా కాలంగా వాయిదా పడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు చివరకు పచ్చజెండా ఊగబోతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే వారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది.
కామారెడ్డిలో ఇటీవల వచ్చిన భారీ వర్షాలు, వరదలపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రమణా రెడ్డి వివాదస్పదంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, "ప్రళయం, విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ఏమీ చేయలేరు" అని వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు, సభ నిర్వహణపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి (ఆగస్టు 30) ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు మొత్తం 3 రోజులపాటు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ జరగనుంది. తెలంగాణ క్యాబినెట్ ఇటీవలే ఈ రిపోర్టును ఆమోదించింది. పూర్తి స్థాయిలో రూపొందించబడిన రిపోర్టు మొత్తం 600 పేజీలకు పైగా ఉంది. అసెంబ్లీ సభ్యులకు ఈ రిపోర్టును అందజేసి, అన్ని పార్టీల అభిప్రాయాలను సవివరంగా తెలుసుకొని, తర్వాత పూర్తి స్థాయిలో చర్చలు నిర్వహించడం లక్ష్యంగా…
ఢిల్లీ - బంజారా, లంబాడా, సుగాళీలను ఎస్సీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, మాజీ ఎంపీ సోయం బాపురావు, మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుండి ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. ఈ సమావేశాలు మొత్తం 3 రోజులపాటు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. సమావేశాల నిర్వహణ కోసం అసెంబ్లీ సిబ్బందికి ఇప్పటికే సంబంధిత ఆదేశాలు జారీ చేయబడినట్లు తెలుస్తోంది.
ఇటీవల టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయాల్లో హీటు పెరిగింది. ముఖ్యంగా బండి సంజయ్కాం, గ్రెస్ పీసీసీ అధ్యక్షుల మధ్య మాటల ఘర్షణ మీడియా ఫోకస్లోకి వచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల ఇచ్చిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల పరిపాటిపై తీవ్ర చర్చలను రేకెత్తిస్తున్నాయి.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్, ప్రభుత్వ సలహాదారుడు వేంనరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ జనహిత యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్పై విరుచుకుపడుతూ, జనహిత యాత్ర లక్ష్యం ప్రజల సమస్యలు తెలుసుకోవడమేనని చెప్పారు.