తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రేపు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు కీలక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయ నిపుణులతో చర్చించనున్నారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. ఈ క్రమంలో మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి, కీలక నిర్ణయాల కోసం కసరత్తు ప్రారంభించింది.
ఓట్ల చోరీ వ్యవహారంపై ఏఐసీసీ పిలుపునకు స్పందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఓట్ల చోరీ వ్యతిరేక ప్రచారానికి సంబంధించిన ప్రత్యేక లోగోను సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు.
Etela Rajender : మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు, సమస్యలను పరిష్కరించడానికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తాజాగా రాష్ట్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసిన ఆయన సమస్యలపై వివరణాత్మక చర్చ నిర్వహించారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ, మల్కాజిగిరి ఎంపీ పరిధిలో పేదలకు కేటాయించాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో సమస్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గతంలో తప్పిపోయిన పేదల జాబితాను మంత్రి…
సీపీఐ రాష్ట్ర కార్యసంఘంలో మరోసారి కూనంనేని ఎన్నిక జరగడం మైదానంలో కలకలం రేపింది. కొత్తగూడెం శాసనసభ్యులు సాంబశివరావు రెండో సారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు, ఇ.టి. నర్సింహా ను ఎంచుకున్నారు.
రంగనాయక సాగర్ ప్రాజెక్టును సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ మ్యూసీ నదికి గోదావరి నీళ్లు తీసుకువెళ్తామన్న వ్యాఖ్యలపై హరీష్ రావు ప్రశ్నించారు.
తెలంగాణలో యూరియా కొరతపై కేటీఆర్ విమర్శలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ఈ వారంలోనే రాష్ట్రానికి అదనంగా 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖను కోరినట్లు మంత్రి తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన రైతుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత రెండు నెలలు గా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.