Ramchander Rao: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 100% బీజేపీ విజయం సాధిస్తుంది
- తెలంగాణలో బీజేపీ స్థిరంగా ఎదుగుతోంది
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 100% బీజేపీ గెలుస్తుంది
- కిషన్ రెడ్డి నేతృత్వంలో విజయం ఖాయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అధ్యక్షతన బీజేపీ ఆఫీస్ బేరర్స్ మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఇందులో భాగంగా.. తెలంగాణలో బీజేపీ క్రమంగా ఎదుగుతోందని, ఒకప్పుడు గ్రామాల్లో ఒకటి రెండు ఓట్లు వచ్చిన చోట ఇప్పుడు వందల సంఖ్యలో ఓట్లు వస్తున్నాయని రామచందర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీని గుర్తించారని, గెలుపు చూస్తున్నామని తెలిపారు.
Uttarpradesh: కారు ఇంజన్ లో పైథాన్.. లగెత్తరో అంటూ పరిగెత్తిన డ్రైవర్
Also Read
- Maharashtra: మహారాష్ట్రలో కరవు ఛాయలు.. 265 తాలూకాలు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటన
- Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
- Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్ల హవా.. పాయింట్ల పట్టికలో పైపైకి..
- Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చారని కాంగ్రెస్, కేసీఆర్ తెచ్చారని బీఆర్‌ఎస్ చెబుతున్నాయని.. కానీ, పార్లమెంట్‌లో బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో ఆత్మహత్యలకు కాంగ్రెస్ కారణమని ఆరోపించారు. గత పదేళ్లుగా పాలకులు మాటలతో మభ్యపెట్టారని, కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క డిక్లరేషన్ కూడా అమలు కాలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాయని, గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయలేకపోతున్నాయని అన్నారు.
అలాగే బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని, అయితే కేంద్రంలో మోడీ ప్రభుత్వం విశ్వకర్మ పథకం తెచ్చిందని తెలిపారు. 42 శాతం రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు ఇస్తుందని, జీఓ ఇస్తే తాము కూడా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. జీఎస్టీ వల్ల అన్ని వర్గాల ప్రజలకు లాభం చేకూరిందని, నిత్యావసరాలు తక్కువ ధరలకు దొరకడానికి మోడీయే కారణమని చెప్పారు. ఆయుష్మాన్ భారత్, కిసాన్ సమ్మాన్ వంటి కేంద్ర పథకాలు తెలంగాణలో ప్రజలకు చేరడం లేదని ఆరోపించారు. రాష్ట్రానికి 12 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపారు.
GST 2.O.: జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంతో బొగ్గు రంగానికి భారీ ఊరట..
ఇంకా.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని లోటు చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తుందని విమర్శించారు. ఎరువుల కొరత రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా లోపమేనని అన్నారు. ఆఫీస్ బేరర్లు హైదరాబాద్‌ను వదిలి గ్రామాలకు వెళ్లి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, కేంద్రం చేస్తున్న పనులను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రంలోని స్థానిక ఎన్నికలను ఆపొద్దని, వాటిలో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కిషన్ రెడ్డి నాయకత్వంలో వంద శాతం బీజేపీ గెలుస్తుందని తెలిపారు. రేవంత్ రెడ్డికి ఆట చేతగాక కిషన్ రెడ్డిపై మాట్లాడుతున్నారని విమర్శించారు.
తాజావార్తలు
-
Maharashtra: మహారాష్ట్రలో కరవు ఛాయలు.. 265 తాలూకాలు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటన
-
Jr NTR: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గాయం తర్వాత ఫస్ట్ టైం రాజమౌళి కొడుకు కోసం పబ్లిక్‌లోకి ఎన్టీఆర్!
-
Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
-
Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్ల హవా.. పాయింట్ల పట్టికలో పైపైకి..
-
Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?