తెలంగాణలో ఇంకా కుదురుకోలేదు. పాదయాత్ర పేరుతో ఖమ్మం జిల్లాను చుట్టేస్తున్నారు వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. తాజాగా ఆమె ఎక్కడినించి పోటీచేస్తానో క్లారిటీ ఇచ్చేశారు. పాలేరు పై షర్మిల కన్ను వెనుక వ్యూహం ఏంటని అంతా చర్చించుకుంటున్నారు. పాలేరు కాంగ్రెస్ కు పెట్టని కోట. అక్కడ కాంగ్రెస్ కు ఎప్పుడూ గెలుపు నల్లేరు మీద బండి నడకే. కాంగ్రెస్ గెలుపు షర్మిలకు కలసి రానుందంటున్నారు. టీఆర్ఎస్ వర్గ పోరు షర్మిలకు కలసి రానుందనేది మరో వర్గం…
సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏం మాట్లాడుకున్నారు? ఇద్దరి భేటీపై ఎందుకు ఆసక్తి రేగుతోంది? ఉండవల్లి తదుపరి రాజకీయం ప్రయాణం ఏంటి? కేసీఆర్, ఉండవల్లి రాజకీయంగా కలిసి నడుస్తారా? లెట్స్ వాచ్..! కేసీఆర్‌తో ఉండవల్లి భేటీపై ఆసక్తికర చర్చ ఉండవల్లి అరుణ్ కుమార్. మాజీ ఎంపీ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సడెన్‌గా హాట్ హాట్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత సైలెంట్‌గా ఉంటూ.. కీలక అంశాలపై అప్పుడప్పుడూ మీడియా…
ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో KCR జాతీయ రాజకీయాల్లోకి రానున్నాడన్న విషయం పై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఖమ్మంలో కూడా KTR కూడా ఇదే విషయం పై ప్రస్తావించడంతో ఈ అంశం మరింత హాట్ టాపిక్ గా నిలిచింది. గత కొన్ని నెలల నుండే ఈ ప్రస్తావన ఉన్నప్పటికీ KTR వ్యాఖ్యలతో ఈ అంశం మరింత జోరందుకుంది. ఇక ఇందులో భాగంగానే .. భారతదేశం కూడా తెలంగాణ మోడల్ గా అభివృద్ధి చెందాలంటే కేసీఆర్…
బీజేపీలో రాష్ట్ర కమిటీ కంటే పవర్ ఫుల్ కోర్ కమిటీ. ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రధాన నాయకులతో ఆ కమిటీని ఏర్పాటు చేస్తుంది జాతీయ నాయకత్వం. ఇందులో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కూడా ఉంటారు. అయితే తెలంగాణలో విస్తరించాలని.. అధికారంలోకి రావాలని చూస్తోన్న కమలనాథులు.. కోర్ కమిటీ ఏర్పాటు ఊసే ఎత్తడం లేదు. దీనిపై మాట్లాడేవారు .. ప్రశ్నించేవారూ కూడా కరువయ్యారు. ప్రధాని మోడీ.. అమిత్ షా, జేపీ నడ్డా వంటి అగ్రనేతలు తెలంగాణకు వచ్చి…
ఖమ్మం జిల్లా వైరా మండలం గన్నవరం ఖానాపురం గ్రామాల్లో 89 వ రోజు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్రకు స్థానిక ప్రజలు వైఎస్సార్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా పాదయాత్రలో గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి షర్మిల నివాళులర్పించారు. గ్రామంలోని ప్రజలు రైతుల కోరిక మేరకు షర్మిల తలపాగా చుట్టి రైతు అవతారంలో ట్రాక్టర్ నడిపి వైఎస్సార్ అభిమానులను రైతులను ఆనందపరిచారు. గన్నవరం నుంచి ఖానాపూర్ వరకు ట్రాక్టర్ నడిపారు.…
ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనగానే రెక్కలు కట్టుకుని హస్తినలో వాలిపోయారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్లు. వరస మీటింగ్‌లతో బిజీ బిజీగా గడిపిన వారంతా.. తిరిగి వెళ్తూనే బోల్డన్ని కలలు కంటున్నారు. అందులో ప్రధానమైన స్వప్నం అసెంబ్లీలో అడుగుపెట్టడం. ఈ విషయంలో ఎవరికివారు ఊహాలోకంలో విహరించేస్తున్నారు. మీటింగ్స్‌లో పార్టీ పెద్దలు ఏం చెప్పారో.. వారి మాటలకు అర్థాలేంటో లోతైన అధ్యయనం చేయకుండానే కొత్త లెక్కలతో కుస్తీ పడుతున్నారట బీజేపీ కార్పొరేటర్లు. ప్రస్తుతం…
తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలలో భాగంగా వచ్చే జనవరిలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ రద్దయ్యే అవకాశం ఉందని PCC మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. శాసన సభ రద్దవ్వగానే మే నెలలోనే ఎలక్షన్లు రాబోతున్నాయని పేర్కొన్నారు. అయితే ఈ ఎన్నికల్లో 50 వేల పైచిలుకు మెజారిటీతో తాను గెలవబోతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ పై ప్రజలు తిరగబడే రోజులు…
సూర్యాపేట కాంగ్రెస్‌లో స్థానికత అంశం ఒక్కసారిగా తెరపైకి వచ్చి చర్చగా మారింది. ఇక్కడ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత పటేల్ రమేష్‌రెడ్డి మధ్య ఓ రేంజ్లో వర్గపోరు నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడానికి ఇద్దరూ కుస్తీ పడుతున్నారు. దీంతో రెండు వర్గాలు హోరాహోరీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.. అదే విధంగా మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. ఇప్పుడు లోకల్.. నాన్ లోకల్ అంశం వీరి మధ్య చిచ్చు పెడుతోంది. రమేష్‌రెడ్డిపై ఆ మధ్య…