Etela Rajender Fires On CM KCR In Sangareddy Pressmeet: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తాజాగా నిప్పులు చెరిగారు. సంగారెడ్డిలోని జహీరాబాద్‌లో ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక, ప్రజాస్వామ్యన్నీ ఖూనీ చేసి రాచరిక వ్యవస్థ నడుపుతున్నారని ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని ముందస్తు అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దేశంలో ప్రజలను ఎన్నడు కలవని ముఖ్యమంత్రి ఒక్క కేసీఆరేనని పేర్కొన్నారు. ఒక మంత్రికి కేసీఆర్ సొంతంగా నిర్ణయాలు కూడా తీసుకోనివ్వరని అన్నారు. ఆబ్కారీ శాఖ ఆదాయాన్ని బెల్ట్ షాపుల ద్వారా అమాంతంగా పెంచారన్నారు. అప్పుల్లో, తాగుబోతుల్లో.. ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ నెంబర్ వన్ అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నా.. వచ్చే ఎన్నికల్లో బిజెపినే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
YouTube channels Ban: భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు..యూట్యూబ్ ఛానెళ్లు బ్యాన్.
అంతకుముందు కూడా.. కేసీఆర్ నేతలను కొనొచ్చేమోకానీ, ప్రజలను కొనలేరని ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్‌కు అహంకారం పెరిగిందని, ప్రజలంటే లెక్కలేకుండా పోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం మాదిరిగానే తూర్పు ఎమ్మెల్యే కూడా నేనే రాజు అనేలా వ్యవహరిస్తున్నారని.. పోలీసులతో ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ నీచ రాజకీయాలను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని, ఇప్పుడే బీఆర్ఎస్ పేరుతో దేశం మీద పడ్డారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పోరాట పురిటిగడ్డ అయిన ఓరుగల్లు, కరీంనగర్ నుంచే అత్యధిక సీట్లలో గెలిచి.. కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెబుతామన్నారు. కుటుంబ పాలన, నియంతృత్వ పాలనకు బీజేపీకి వ్యతిరేకమని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.
CM KCR: కుల-మతపిచ్చితో విద్వెషాలు రెచ్చగొడితే.. రాష్ట్రం తాలిబన్ల మాదిరి మారుతుంది