తెలంగాణలో హాట్ హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. గాంధీ భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో రేవంత్ కేసీఆర్ పై తీవ్రంగా స్పందించారు. పంచాంగ పఠనం, ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రైతుల జీవితంపై మరణ శాసనం రాశాడు కేసీఆర్ అన్నారు రేవంత్. కోడికి ధర తక్కువ.. మసాలాకే ధర ఎక్కువ అయ్యిందంటూ పెట్రోల్, డీజిల్ ధరల్ని ప్రస్తావించారు. లీటర్ పెట్రోల్ నిజానికి 50 రూపాయలకే వస్తుంది. కానీ, కేసీఆర్ 35 రూపాయలు, మోడీ 30 రూపాయలు…
1.ఏపీలో ప్రభుత్వాస్పత్రిలో మహిళలు ప్రసవించిన అనంతరం సురక్షితంగా ఇంటికి చేరేందుకు వైఎస్ఆర్ తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రభుత్వం ప్రారంభించింది. దాదాపు 500 వాహనాలను శుక్రవారం సీఎం జగన్ విజయవాడ బెంజి సర్కిల్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయని వెల్లడించారు. టీడీపీ హయాంలో అరకొరగా ఉన్న తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల స్థానంలో 500 కొత్త వాహనాలను ప్రారంభించామని తెలిపారు. అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు అత్యాధునిక…
1.దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వరుసగా ప్రైవేట్ పరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు మార్చి 28, 29 తేదీల్లో భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కూడా సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపింది. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి ముందుగా లావాదేవీలను పూర్తి చేసుకోవాలని సూచించింది. 2.ఏపీలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త అందించేందుకు పాఠశాల…
తెలంగాణ బీజేపీలో త్వరలో కొందరిపై వేటు పడబోతుందా? తూతూ మంత్రంగా పనిచేస్తున్న వారికి షాక్ తప్పదా? బండి సంజయ్ ఎవరిపై కన్నెర్ర చేశారు? ఆయన హెచ్చరికలు వర్కవుట్ అవుతున్నాయా.. లేదా? జిల్లా అధ్యక్షుల పనితీరుపై పెదవి విరుపుతెలంగాణలో ప్రత్యమ్నాయశక్తిగా పొలిటికల్ తెరపైకి రావాలని చూస్తోన్న బీజేపీ.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. పోలింగ్ బూత్ నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల పనితీరును సమీక్షిస్తోందట. అనుబంధ సంఘాలు.. పార్టీ కార్యక్రమాలు.. జిల్లాల్లో సొంతంగా చేపట్టిన పొలిటికల్ ప్రోగ్రామ్స్‌పై…
కొండా సురేఖ.. తెలంగాణ రాజకీయాల్లో ఆమె సంచలనం. ఆమె పార్టీ మారుతున్నారనే ప్రచారం నేపథ్యంలో తమ రాజకీయ ప్రస్థానం గురించి ఆమె క్లారిటీ ఇచ్చారు. తాము పార్టీ మారడం లేదని కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చేశారు కొండా కపుల్. వరంగల్ తూర్పు మాదే..పార్టీ మరే ప్రసక్తే లేదు.. ఇది అంతా గిట్టని వల్ల ప్రచారం అంటూ కొట్టిపారేశారు. అత్యంత వైభవంగా జరిగిన కూతురు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా స్పష్టం చేశారు కొండా దంపతులు. వరంగల్ తూర్పులో కొండా…
1.దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు వరుసగా పెరుగుతూ పోతున్నాయి. గత ఐదు రోజుల్లో నాలుగోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో సామాన్యులపై భారం పడుతూనే ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలను కేంద్రం పెంచుతోందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అయితే ఈ విమర్శలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు 2.ఏపీలో కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్ ఏప్రిల్ 1 నాటికి వస్తుందని ఏపీ ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయ్…
1.RRR ఎట్టకేలకు తెరపైకి వచ్చి అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి నటించిన ఈ క్రేజీ మల్టీస్టారర్ పలు వాయిదాల అనంతరం థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే సినిమా రిలీజ్ కు ముందురోజు వరకూ ఇండియా వైడ్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నారు ‘ఆర్ఆర్ఆర్’ త్రయం. ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు సినిమాకు…
1.ఏపీ అసెంబ్లీలో పాలన వికేంద్రీకరణ అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చర్చ ప్రారంభించారు. చట్టాలు చేసే అధికారం కేవలం శాసన వ్యవస్థకే ఉన్న విషయాన్ని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారని ఆయన వెల్లడించారు. మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తాను సీఎం జగన్‌కు లేఖ రాసిన విషయాన్ని ధర్మాన ప్రసాదరావు గుర్తు చేశారు. 2. సిరిసిల్ల పట్టణంలో కొనసాగుతున్న నేత కార్మికుల సమ్మెకు సంఘీభావం…
1.తెలంగాణ రాజకీయం హస్తినలో చేరింది. ఢిల్లీలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ల్యాండ్ అయ్యారు. అయితే అందరూ కలిసిమెలసి ఢిల్లీకి వెళ్లారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. ఢిల్లీకి వెళ్లేందుకు ఒక్కొక్కరి ఒక్కో ప్రాబ్లెం.. కాంగ్రెస్ విషయానికి వస్తే.. తెలంగాణ కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన జగ్గారెడ్డి ఎపిసోడ్, తదితర అంశాల గురించి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇచాంర్జీ మాణిక్కం ఠాగూర్‌తో మాట్లాడేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెళ్లారు. అధిష్టానం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్…
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రాజకీయంలో పోలీసులు ఇరుక్కుని పోయారు. ఆరు రోజుల క్రితం పోలీసు స్టేషన్ కు తీసుకుని వచ్చిన మాజీ కార్పోరేటర్ ఆచూకీ లేకుండా పోయింది. ఈఘటనపై భార్య ఆందోళన చేస్తే ఆమె పట్ల పోలీసు అధికారులే దురుసుగా ప్రవర్తించారు. తన భర్తను ఏమి చేశారని భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఎంఎల్ఎ కందాల ఉపేందర్ రెడ్డి ఆయన అనుచరులు తన భర్త పై కేసు పెట్టించారని జంగం భాస్కర్ భార్య కల్పన ఆరోపిస్తోంది.…