సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాసారు. రామగుండంలో వంద పడకల ESI ఆస్పత్రి నిర్మాణానికి అనువైన స్థలాన్ని కేటాయించాలని లేఖలో పేర్కాన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తానన్న ప్రస్తుత భూమి, ఆస్పత్రి నిర్మాణానికి అనువుగా లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తానన్న భూమిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను లేఖతోపాటు సీఎం కేసీఆర్కు కిషన్రెడ్డి పంపించారు. అయితే.. రామగుండంలో వంద పడకల ESI ఆస్పత్రి నిర్మాణానికి భూమిని కేటాయించాలని, అయితే..…
MLC Jeevan Reddy Fires ON PM Narendra Modi: ఈడీల పేరుతో మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ను తీవ్ర ఇబ్బందులు పెడుతోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేస్తున్న సందర్భంగా.. మానసిక ఒత్తిడికి గురి చేస్తోందని ఆగ్రహించారు. సోనియా గాంధీకి ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు.. యావత్ జాతి అండగా ఉంటుందని చెప్పారు. యంగ్ ఇండియా సంస్థను వ్యాపార దృష్ట్యా ఏర్పాటు చేయలేదని.. సేవా దృక్పథంతోనే దాన్ని ఏర్పాటు చేయడం…
రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం కే. లక్ష్మణ్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన లక్ష్మణ్.. తెలంగాణ సీఎం కేసీఆర్పై ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ జాతీయ పార్టీ అని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని, ప్రధాని మోదీని ప్రశ్నించే స్థాయి ఆయనకు లేదని విమర్శించారు. టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, ఎంఐఎంకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. టీఆర్ఎస్లో వెన్నుపోటు పొడిచేందుకు కట్టప్పలు సిద్ధంగా ఉన్నారని, ఈ కట్టప్పల…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రెండు పొలిటికల్ పార్టీలు మాత్రమే ఉండేవి. ఒకటి.. కాంగ్రెస్. రెండు.. తెలుగుదేశం. కాబట్టి ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేవి. ఒక పార్టీ మహాఅయితే వరుసగా రెండు సార్లు మాత్రమే గెలిచేది. అందువల్ల పదేళ్ల తర్వాత మరో పార్టీకి ఛాన్స్ వచ్చేది. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ‘అంతర్గత ప్రజాస్వామ్యం’ పేరుతో స్వేచ్ఛగా ఒకరినొకరు విమర్శించుకునేవారు. హస్తం పార్టీలో ఎప్పుడూ రెండు,…
తెలంగాణలో రాక్షస, నయా నిజాం పాలన సాగుతోందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ పార్టీ నుంచి సామ వెంకట్ రెడ్డి, నవతా రెడ్డి బీజేపీ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యమకారుల పార్టీగా చెప్పుకునే టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు స్థానం లేదని.. ఉద్యమ ద్రోహులకు టీఆర్ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో స్థానం కల్పించారని విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచడానికి బీజేపీ కృషి చేస్తోందని ఆయన అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలకు భిన్నంగా రాష్ట్ర ముఖ్యమంత్రి…