DK Aruna Fires On CM KCR Over Preethi Case: సీఎం కేసీఆర్ మెడికో ప్రీతి కేసుని నీరుగార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని.. తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగి, ఈ కేసుని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని, అలా చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే, ప్రీతి హత్య కేసులో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆపేందుకు.. సీఎంగా కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రీతి ఘటనపై నిజానిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు.
High Court Stay on Polavaram Canal: పోలవరం కాలువ తవ్వకాలపై హైకోర్టు స్టే
కేసీఆర్‌కు మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదని డీకే అరుణ ఆరోపణలు చేశారు. మంత్రుల కుటుంబసభ్యులు క్రిమినల్ కేసుల్లో ఉన్నప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం వారిని కాపాడుకుంటూ వెనకేసుకు వస్తోందని వ్యాఖ్యానించారు. ఈ తీరు వల్లే.. బీఆర్ఎస్ తమకు అండగా ఉంటుందని నేరస్తులు ధీమాగా ఉన్నారని మండిపడ్డారు. తన గొప్పతనాన్ని చాటుకోవడం కోసం దిశా కేసులో ఎన్‌కౌంటర్ చేయించారన్నారు. కేఎంసీ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పనిచేయలేదంటే.. నేరం నుంచి తప్పించుకోవడం కోసం పకడ్బందీగా ఎలాంటి ప్లాన్ వేశారో అర్థం చేసుకోవాలన్నారు. మొదటి క్యాబినెట్‌లో మహిళలు లేరని, రెండో క్యాబినెట్‌పై రాష్ట్రంలో చర్చ జరుగుతోందని ఇద్దరు మహిళలకు కేసీఆర్ చోటిచ్చారన్నారు.
Kushboo Sundar: నా తండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. అక్కడ తాకుతూ
రాష్ట్రంలో ఎక్కడ చూసినా నేరాలు జరుగుతున్నాయని, ఆడపిల్లలను చదువు కోవడం కోసం హాస్టల్స్‌కు పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారని డీకే అరుణ అన్నారు. మరోసారి అధికారంలోకి రావాలని ఆలోచన తప్పితే.. మహిళలపై జరుగుతున్న దారుణాలుపై కేసీఆర్ ఆలోచన చేస్తున్నాడా? అని నిలదీశారు. కార్పోరేట్ విద్యాసంస్థల్లో ఒత్తిడి గురై, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. అలాంటి కాలేజీ యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అసలు ఈ వ్యవహారంపై ఏనాడైనా తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించిందా? అనే సందేహం వ్యక్తం చేశారు.
MLC Kavitha: మహిళలు వంట గదిలోనే ఉండాలన్న రోజులు పోవాలి