Boinapally Vinod Kumar Fires On BJP and Congress: తమకు పుట్టగతులు ఉండవనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల అకాల వడగండ్ల వర్షం కురిసినప్పుడు నష్టపోయిన ఒక రైతును తాను కలిశానన్నారు. ఈ వర్షం కారణంగా తాను రూ. 50 లక్షలు నష్టపోయానని, అయినా సరే మళ్లీ సేద్యం చేస్తానని, ఎందుకంటే తమకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని ఆ రైతు చెప్పినట్టు వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రైతులు ఇంత ధైర్యంగా ఉన్నారంటే, అది కేసీఆర్ వల్లే సాధ్యమైందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు సైతం తెలంగాణ అభివృద్ధిని కాదనలేరన్నారు. ఇక టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ ఘటన దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై బండి సంజయ్, రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ పీఏ ఊరికి చెందిన వారు 100 మంది పాసయ్యారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సిట్ అధికారులు నోటీసులు ఇస్తే.. ఆ ఇద్దరు స్పందించడం లేదని దుయ్యబట్టారు.
Vishnu Vishal: భార్యకు విష్ణు విడాకులు.. ? అసలేమైంది..?
అంతకుముందు.. అకాల వర్షం, వడగండ్ల వానతో పంట నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించిన వినోద్ కుమార్, బాధిత రైతులకు భరోసా కల్పించారు. రైతులు అధైర్య పడవద్దని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామస్థులతో స్వయంగా మాట్లాడి, పంటల నష్టం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మరో కార్యక్రమంలో నీటి ప్రాధాన్యత గురించి వినోద్ కుమార్ మాట్లాడారు. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవాలని, నీరే భవిష్యత్తుకు జీవనాధారమని పేర్కొన్నారు. నీటిని సంరక్షిస్తేనే భవిష్యత్తు ఉంటుందని, ఈ వాస్తవాన్ని ప్రతిఒక్కరూ గ్రహించాలన్నారు. సమస్త ప్రాణ కోటికి, చెట్లకు, ముఖ్యంగా మానవ మనుగడకు నీటి ఆవశ్యకత ఎంతో కీలకమన్నారు. నీటి సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ ఎన్నో గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో సుమారు 44వేల చెరువుల్లో పూడికలు తీయించారని, ఫలితంగా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లను పంట పొలాలకు, చెరువులు, కుంటలకు తరలించడం వల్ల.. గ్రౌండ్ వాటర్ కూడా విస్తృతంగా పెరిగిందని చెప్పారు. నీటి ప్రాధాన్యతను ఎవరూ మరిచిపోవద్దని, నీటిని వృథా చేస్తే రేపటి తరానికి మిగిలేది కన్నీరేనని హెచ్చరించారు.
Bandi Sanjay: సీఎం కేసీఆర్‌కి బండి సంజయ్ లేఖ.. ఆ రోజులు వస్తాయని హెచ్చరిక