BRS MLA Sanjay Kumar: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
నామినేటెడ్ పదవుల భర్తీ, టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ వంటి పలు అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏఐసీసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం ఢిల్లీలో సమావేశమైన నేపథ్యంలో పలువురు రాష్ట్ర నేతల్లో ఉత్కంఠ నెలకొంది. నామినేటెడ్ పదవుల నియామకంలో పార్టీ విజయానికి కృషి చేసే నేతలకే ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో పలువురు నేతలు గాంధీభవన్కు బారులు తీరుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు తమ తమ లాబీయింగ్ను వివిధ మార్గాలలో పరిష్కరించి పోస్టులను దక్కించుకున్నారు.…
BJP For Farmers: కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో రైతుల సమస్యలపై బీజేపీ రణభేరీ మోగించింది. 6 హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీజేపీ నిర్ణయించింది.
KCR Bus Yatra: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతల రాకతో పార్టీల ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే.చంద్రశేఖర్ రావు రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర 24వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే.
Harish Rao Vs Revanth Reddy: గన్ పార్క్ వద్ద ఉద్రికత్త వాతావరణం నెలకొంది. గన్ పార్క్ వద్దకు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు అడ్డుకున్నారు.
TS BJP Leaders Nominations: తెలంగాణ రాష్ట్రంలో నేటితో నామినేషన్ల పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు బీజేపీ నుంచి నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
కేసీఆర్ సిరిసిల్లలో వడ్ల బోనస్ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి డ్రాయర్ ఊడదీస్తా అంటున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు సీఎంవా చెడ్డి గ్యాంగ్ లీడర్వా రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు కేరాఫ్ అడ్రస్ అని, ఆ పార్టీది ‘ఆపన్న హస్తం కాదని, భస్మాసుర హస్తమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ‘పాంచ్ న్యాయ్’ పేరుతో మళ్లీ కొత్త హామీలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైందన్నారు. తెలంగాణను 10 ఏళ్లపాటు పాలించిన కేసీఆర్ రాష్ట్రంలో రైతుల దుస్థితికి ప్రధాన కారణమన్నారు.