Bhatti Vikramarka : హనుమకొండలో ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వరంగల్ ఒక్క పట్టణానికి 6 వేల కోట్ల పనులను మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం ఇది అని, వరంగల్ పట్టణాన్ని మహా నగరాన్ని చేసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తున్నామన్నారు. మహిళ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనే ఆలోచనలో అన్ని ఆ నాటి ఇందిరమ్మ ప్రభుత్వం లో తెచ్చినవే.. అలాంటి సంక్షేమ పథకాలను టి ఆర్ ఎస్ ప్రభుత్వం తీసేసిందని ఆయన మండిపడ్డారు. మహిళ సంఘాలకు రుణాలు ఇవ్వడమే కాదు వాటి తో వ్యాపారం చేసిన మహిళ సంఘాలను బలోపేతం చేసే ఆలోచనలు చేస్తోందని, మహిళ సంఘాలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పెట్టి ఆ విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వం కొని వారికి లాభాలు వచ్చే లా ఆలోచనలు చేసిన ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన అన్నారు. ఇది మహిళ ప్రభుత్వం.. మేము ఇచ్చింది చూసుకోండి అని ఆయన అన్నారు. మేము ఇచ్చింది చూస్తే కొందరికి కళ్ళు తిరుగుతున్నాయన్నారు.
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా వేలంలో నిలిచిన అత్యంత వయస్కులైన ఆటగాళ్ళు వీరే..
అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ఏమీ చేయకపోవడం ప్రతిపక్షాల ఆరోపణగా ఉండగా, తాము మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని భట్టి విక్రమార్క అన్నారు. గత సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తూ, వరంగల్ జిల్లాలో ఆయన ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం పై సెటైర్ వేశారు. “కేసీఆర్ కుర్చివేసి కాలనీ కట్టిస్తానని చెప్పి, దావత్ ఇవ్వాలనిచ్చినా ఆయన కనిపించలేదు” అని భట్టి విక్రమార్క అన్నారు. కాగా, తమ ప్రభుత్వం వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రాన్ని ఆరు నెలల్లోనే పూర్తి చేసి ప్రారంభించిందని, కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తున్నామని చెప్పారు.