Aadi Srinivas : హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ నేతలకు చెంప చెళ్లుమనిపించేలా ఉంది
- హైకోర్టులో బీఆర్ఎస్ భంగపడింది
- అనర్హత పైన సర్వాధికారులు స్పీకర్‌కు ఉన్నాయని కోర్టు తేల్చింది
- తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని మాత్రమే న్యాయస్థానం సూచించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadi Srinivas : ఎమ్మెల్యేల అనర్హత పైన హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ పార్టీ నేతలకు చెంప చెళ్లుమనిపించేలా ఉందని ప్రభుత్వ విప్ , వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టులో బీఆర్ఎస్ భంగపడిందని, అనర్హత పైన సర్వాధికారులు స్పీకర్ కు ఉన్నాయని కోర్టు తేల్చిందన్నారు ఆది శ్రీనివాస్. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని మాత్రమే న్యాయస్థానం సూచించిందని, నిర్ణీత సమయాన్ని కూడా కోర్టు ప్రస్తావించలేదని ఆయన తెలిపారు. అన్ని విషయాలు తెలిసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లి దెబ్బతిన్నారని, రాజ్యాంగం ప్రకారం సభాపతి నడుచుకుంటారన్నారు ఆది శ్రీనివాస్. కోర్టు తీర్పు రాకుండానే గతంలో కేటీఆర్ ఈ విషయంలో ఎగిరెగిరి పడ్డారని, అప్పుడే ఉప ఎన్నికలు వచ్చినట్లు గా హడావిడి చేశాడని ఆయన మండిపడ్డారు. చేసిన పాపం గోచిలో పెట్టుకొని కాశీ కి పోయినట్లు కేటీఆర్, బీఆర్ఎస్ నేతల తీరు ఉంది అని ఆయన హెద్దెవ చేశారు. 10 యేళ్ల పాటు రాజ్యాంగాన్ని అపహస్యం చేసి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, ప్రతిపక్ష పార్టీలకు చెందిన 60 మంది కి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ లను బీఆర్ఎస్ చేర్చుకుందన్నారు ఆది శ్రీనివాస్.
Stock Market: స్టాక్ మార్కెట్‌కు సరికొత్త జోష్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే లను క్యాబినెట్ లో చేర్చుకొని నైతిక విలువ లను కాళేశ్వరంలో కలిపారని, పార్టీలకు పార్టీలను విలీనం చేసుకుని రాజ్యాంగాన్ని ఖూనీ చేశారన్నారు. అంతేకాకుండా..ప్రతిపక్ష పార్టీలు ఎంత గగ్గోలు పెట్టినా కేసీఆర్ లెక్కచేయలేదు.. తెలంగాణ పునర్ నిర్మాణం కోసం ఫిరాయింపులు చేసుకోవచ్చునని నిర్లజ్జగా చెప్పుకొని తిరిగారు.. అధికారం పోయిన తర్వాత రాజ్యాంగం, న్యాయస్థానాలు గుర్తుకు వచ్చాయి… భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయం… ఐదారుగురు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు ఆ పార్టీ లో ఉండరు… కేసీఆర్ ఫామ్ హౌస్ కు, కేటీఆర్ గెస్ట్ హౌస్ కు, హరీష్ రావు నార్సింగి హౌస్ కు పరిమితం కావాల్సిందే అని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
Mumbai 26/11 attack: భారత్‌కి అప్పగింతను వ్యతిరేకిస్తూ, యూఎస్ సుప్రీంకోర్టుకు ఉగ్రవాది రానా..
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!