TPCC Mahesh Goud : రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో అద్భుతమైన పాలన అందించింది
- ఏడాది కాలంలో కాంగ్రెస్ అద్భుతమైన పాలన అందించింది
- ఏ రాష్ట్రం చేయలేనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మనం చేశాం
- బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేని అనేక పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రులు చేసి చూపించారు : మహేష్ కుమార్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Goud : రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో అద్భుతమైన పాలన అందించిందని, దేశంలో ఏ రాష్ట్రం చేయలేనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మనం చేసి చూపించామన్నారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేని అనేక పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రులు చేసి చూపించారని ఆయన వ్యాఖ్యానించారు. 18 వేల కోట్ల వ్యవసాయ రుణాలు, ఆర్టీసీ ఉచిత ప్రయాణాలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 500 రూపాయలకు గ్యాస్, 50 వేల ఉద్యోగాలు లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆయన అన్నారు. ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా ప్రజల్లోకి తీస్కెళ్లాలన్నారు మహేష్ గౌడ్. కాంగ్రెస్ కార్యకర్తలు మన ప్రభుత్వం చేసిన పనులను ఇంటింటికి తీసుకెళ్లాలన్నారు.
Also Read
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వంపైన విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలి. అందుకు తగ్గట్టు మన ప్రచారం ఉండాలని ఆయన అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనేక మందికి కార్పొరేషన్ల పదవులు వచ్చాయని, డీసీసీ అధ్యక్షులకు అందరికి పదవులు వచ్చాయన్నారు. అనుబంధ సంఘాల చైర్మన్ లకు పదవులు వచ్చాయని, ఇంకా చాలా పదవులు ఇవ్వాల్సి ఉందన్నారు మహేష్ కుమార్ గౌడ్. పార్టీ కోసం పని చేసిన అందరికి పదవులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని, రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలలో పార్టీ అన్ని విధాలుగా గట్టిగా కృషి చేయాలన్నారు. మంచి ఫలితాలు రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు.
Satya Dev: ‘జీబ్రా’ నా అదృష్టం..కొత్త ఎక్స్ పీరియన్స్ : హీరో సత్యదేవ్
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!