CM Revanth Reddy: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల బెయిల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Jupally Krishna Rao: గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి నివాసానికి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు. ఇవాళ ఉదయం కృష్ణ మోహన్ రెడ్డికి జూపల్లి వెళ్లి ఆయనతో పలహారం చేశారు.
రానున్న రోజుల్లో తెలంగాణలో సామాన్య కార్యకర్త సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. బీజేపీ అంటే ఉత్తర భారతదేశం పార్టీ అని కొంత మంది కామెంట్ చేశారని.. కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాబల్యం ఉందని వారికి అర్థమైందన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో 46 మందిని పార్టీలో చేర్చుకున్నారని చెప్పారు. తాను చెప్పిన వివరాలు తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని షబ్బీర్ అలీ అన్నారు. మరి కేటీఆర్ ఏం చేస్తారో చెప్పాలని ఛాలెంజ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంతో తెలంగాణలో ఏమి మారలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన హామీల అమలులో వైఫల్యంపై పోరాటం చేయాలని రాజకీయ తీర్మానం చేశామన్నారు. రైతు భరోసా 15 వేలు ఇస్తామని చెప్పారని.. ఇప్పటి వరకు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేయవద్దని ప్రసారమాధ్యమాలకు విజ్ఞప్తి చేశారు.