బీజేపీ తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అనుకూల వాతావరణం ఉందని, ప్రజలు మోడీ పాలన కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. లేని అంశాలను కావాలని తెరమీదకు తెస్తూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని మండిపడ్డారు.
Bandla Ganesh: సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కొత్త ప్రభుత్వాన్ని శుభకాంక్షలు తెలిపారు. మంగళవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ.. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతానికి కొత్త ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదన్నారు. 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తారో చూడాలని, అప్పటి వరకు వేచి చూస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం, డిప్యూటీ సీఎంలు కేంద్రం సాయం…
Karimnagar: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మానకొండుర్ నియోజకవర్గ స్థాయిలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తిమ్మపూర్ మండలం కొత్తపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్లో హాల్లో జరిగిన ఈ సమావేశంలో మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రసమయు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యానారాయణపై మండిపడ్డారు. Also Read:…
ఆరవ రోజు అసెంబ్లీ సమావేశంలో విద్యుత్‌పై వాడివేడిగా చర్చ జరుగుతుంది. అధికార పార్టీ, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కరెంట్ మొండి బకాయిల అంశాన్ని లేవనెత్తారు. ఈ మేరకు సభలో సీఎం మాట్లాడుతూ.. మొండి బకాయిల్లో హరీష్ రావు నియోజకవర్గం సిద్ధిపేట, మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వెల్, అలాగే సౌత్ హైదరాబాద్‌లే టాప్‌లో ఉన్నాయని విమర్శించారు. ఇన్ని విషయాలు మాట్లాడుతున్న అక్బర్ తమ ప్రాంతంలో ఉన్న…
కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల పేరుతో అక్రమాలంటూ మాజీ మేయర్ రవీందర్ సింగ్ మేయర్ సునీల్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ మంజూరు చేసిన 130 కోట్ల స్మార్ట్ సిటీ నిధులలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఆయన మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అంజేశారు. ఆయన వినతి పత్రాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ గతంలోని బిల్లులు జరగబోయే బిల్లులను ఆఫ్‌లైన్ ద్వారా విచారణ జరపాలని అధికారులను…
గాంధీభవన్‌లో పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ అధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు పీఏసీ కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం పార్లమెంటు ఎన్నికలు, ఇతర కీలక అంశాలపై పీఏసీ చర్చించి నిర్ణయించింది. ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని తీర్మానించినట్టు పీఏసీ పేర్కొంది. Also Read: Big Shock: నల్లగొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు బిగ్ షాక్ పీఏసీ…
Vijayshanti Tweet: కాంగ్రెస్ నేత విజయశాంతి మాజీ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై ఆమె స్పందించారు. ఈ మేరకు సోమవారం ఆమె ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలన్ని అమలు చేయాలని ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. ‘సుమారు 10 సంవత్సరాల తెలంగాణ ఖజానా మొత్తం కొల్లగొట్టి, 5 లక్షల కోట్ల అప్పు…
Paidi Rakesh Allegations On Jeevan Reddy: మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జీవన్ రెడ్డి తనని చంపేందుకు కుట్ర పన్నుతున్నారని, ఆయన అనుచరులు కాల్స్ చేసి బెదిరిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జీవన్ రెడ్డి కూడా తనకు కాల్ చేశాడని మీడియా ముఖంగా రాకేష్ రెడ్డి చూపించారు. విదేశాల నుంచి తనని చంపుతామంటూ తరచూ…
దీక్ష దీవాస్ పేరుతో బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత సీఈఓకు ఫీర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిన్న కేటీఆర్ దీక్ష దివాస్ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునివ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే.. అందుకే సీఈఓకి ఫిర్యాదు చేశామన్నారు. ‘రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా? అనే అనుమానం కలుగుతోంది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి సైలెన్స్ పిరియాడ్ కొనసాగుతోంది. ఎన్నికలకు సంబంధించి…