బోయినపల్లి మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో ఒక్కొక్కటిగా కీలక అంశాలు బయటపడుతున్నాయి. స్కూల్ యజమాని మలేలా జయప్రకాశ్ గౌడ్ దాదాపు 10 నెలలుగా అల్ప్రాజొలామ్ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
హైదరాబాద్ బోయినపల్లి మేధా స్కూల్లో వెలుగులోకి వచ్చిన డ్రగ్ తయారీ కేసు సంచలనంగా మారింది. ఈగిల్ టీమ్ నిర్వహించిన సోదాల్లో స్కూల్ లోపలే అల్ప్రాజొలామ్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసిన విషయం బయటపడింది.
సికింద్రాబాద్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. బోయిన్పల్లి పరిధిలోని ఒక స్కూల్ లోపలే పెద్ద ఎత్తున మత్తుమందు తయారీ జరుగుతుందని గూఢచారి సమాచారంపై ఈగల్ టీం దాడి చేసింది.
కరీంనగర్ జిల్లాలో క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు ఎగనామం చేసిన ముఠాపై పోలీసులు నిఘా కుదిపారు. “మూడింతల లాభాలు వస్తాయి” అంటూ ప్రజలను నమ్మబలికిన ఈ గ్యాంగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు షాకింగ్ విషయాలను బయటపెట్టారు.
సూర్యాపేట జిల్లా కోదాడలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. శోభాయాత్రలో పాల్గొన్న యువకుల మధ్య ఘర్షణ తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
దుండిగల్ చెరువులో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని హైడ్రా DRF సిబ్బంది సకాలంలో స్పందించి కాపాడారు. కుటుంబ కలహాలతో మానసిక ఆవేదనకు గురైన రహీం అనే వ్యక్తి చెరువులో దూకి తన ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నించాడు.
హైదరాబాద్ మాదాపూర్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా నగరంలో పిల్లల కిడ్నాప్‌లకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఆగస్టు 26న చందానగర్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ నగరంలో మరోసారి రేవ్ పార్టీ బస్టింగ్ జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ టీమ్, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ వాడుతున్న పలువురిని పట్టుకున్నారు.
వరంగల్ నగరంలో మరో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్సై శ్రీకాంత్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. వివరాల ప్రకారం, ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి స్థానికంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న దళిత మహిళ మరియమ్మపై దాడి చేసిన ఘటన జరిగింది.