హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ జువైనల్ హోంలో మళ్లీ లైంగిక దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఒక బాలుడిపై లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న సూపర్వైజర్ రెహమాన్ (27) పై మరోసారి కొత్త కేసు నమోదైంది.
Rave Party : హైదరాబాద్ నగర శివారులో మళ్లీ రేవ్ పార్టీ కలకలం రేగింది. మాదకద్రవ్యాలు, మద్యం, క్యాసినో కాయిన్స్‌తో సాగే ఈ రాత్రి పార్టీలకు మరోసారి తెరలేపిన ఘటన ఇది. రాచకొండ పరిధిలోని మహేశ్వరం మండలం చెర్రాపల్లి సమీపంలోని కె. చంద్రారెడ్డి రిసార్ట్స్‌లో ఈ రేవ్ పార్టీ జరిగింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా SOT పోలీసులు రాత్రి ఆలస్యంగా దాడులు నిర్వహించి, రిసార్ట్స్‌లో జరిగిన అశ్లీల విందును అడ్డుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ పార్టీని…
మెదక్ జిల్లా కొల్చారంలో జరిగిన మహిళ హత్యాచారం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. జిల్లా పోలీసులు నిందితుడిని ఫకీర్ నాయక్ గా గుర్తించి, అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఖమ్మం జిల్లా నడిబొట్టున దాదాపు 200 కోట్ల పైచిలుకు వివాదంలో చిలికి చిలికి గాలి వానగా మారుతుంది .ఈ వివాదంలో పోలీసులు ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వివాదం చల్లారటం లేదు.
Drugs : డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బును హవాలా రాకెట్‌గా మారుస్తున్న గ్యాంగ్‌ను పట్టుకుంది తెలంగాణ ఈగల్ టీమ్. ముంబై కేంద్రంగా హవాలా రాకెట్ నడుపుతున్న కింగ్‌పిన్‌ను పట్టుకున్నారు. హవాలా రూపంలో నైజీరియన్ డ్రగ్ కార్టెల్స్‌కు డ్రగ్ మనీ పంపుతున్నట్లు గుర్తించారు పోలీసులు. పెద్దమొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ఈగల్ ఫోర్స్ మరో పెద్ద మాఫియా గుట్టురట్టు చేసింది. ముంబై కేంద్రంగా నడుస్తున్న హవాలా నెట్‌వర్క్‌ను చేధించడమే కాకుండా… హవాలా రాకెట్ నడుపుతున్న కింగ్‌పిన్‌ను పట్టుకున్నారు…
Engineering College : కాలేజీ లాకర్స్‌లో భద్రంగా దాచిన కోటి రూపాయల నగదు దోచుకెళ్లారు దొంగలు !! ఎవరికంటా కనపడకుండా లోపలికి దూరి.. లాకర్స్ బ్రేక్ చేసి మరీ దోచుకెళ్లారు !! 200 సీసీ కెమెరాలకు చెందిన డీవీఆర్‌ను కూడా ఎత్తుకెళ్లారు !! ఇదంతా వింటుంటే… ఏదో తేడాగా ఉందే ? అనిపిస్తోందా..? పోలీసులు కూడా ఇదే అనుమానిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మేట్‌లోని బ్రిల్లియంట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో జరిగిన దోపిడీ సంచలనం రేపుతోంది. ఇది అబ్దుల్లాపూర్‌మేట్‌లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజ్.…
Love Story : ప్రేమ వేధింపులకు మరో యువతి బలైంది. చదువుతో పాటు అన్ని రంగాలలోనూ ఫస్ట్ ప్లేస్‌లో ఉండే ఆ యువతి.. ప్రేమ వేధింపుల కారణంగా తనువు చాలించింది. రోజు రోజుకు వేధింపులు మితిమీరుతుండటంతో.. తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఇటు వేధింపులు తట్టుకోలేక మనస్థాపానికి గురై.. చివరకు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు మౌనిక. లాలాగూడలోని రైల్వే డిగ్రీ కాలేజీలో బీఏ సెకండ్ ఇయర్ చదువుతుంది. మౌనిక కుటుంబం లాలాగూడలో నివాసం ఉంటోంది.…
నల్గొండ జిల్లాలో జరిగిన ఒక ఘటనను మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. యూరియా కోసం ధర్నా చేసిన ఒక గిరిజన యువకుడిపై పోలీసులు కులం పేరుతో దూషిస్తూ, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, కాళ్లు కట్టి లాఠీలతో బాదడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. 30 సంవత్సరాల మహిళను కిడ్నాప్ చేసి, రేప్ చేసి, చివరకు హత్య చేసిన కేసులో పోలీసులు ముగ్గురు ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేశారు.