స్కూల్ లో వేధింపులు తట్టుకోలేక సైన్స్ టీచర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,అస్సాం రాష్ట్రానికి చెందిన మార్కస్ బాగే (33) తండ్రి పియుష్ బాగే అనే అతనికి ఎనిమిది సంవత్సరాల క్రితం జూలీ లోవాని(29) తో ప్రేమ వివాహం జరిగింది కాగా వీరు జీవనోపాధి కోసం అస్సాం రాష్ట్రం నుండి హైదరాబాద్ కు వలస వచ్చి అబ్దుల్లామెట్ మండలం తుర్కయంజాల్ మున్సిపాలిటీలో…
ఆస్తి కోసం కొంత మంది ఎంతకైనా తెగిస్తున్నారు. హైదరాబాద్‌లో తాజాగా జరిగిన ఘటన ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. సైదాబాద్ విష్ణునగర్‌లో వృద్ధుడిని చంపేసిన కోడలు.. దోపిడీ దొంగల ప్రయత్నంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది.
హైదరాబాద్ నగరంలోని నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్)లో ర్యాగింగ్ ఘటన చోటుచేసుకుని కలకలం రేపింది. 9వ తరగతి చదువుతున్న రిషాంత్ రెడ్డి అనే విద్యార్థి పుట్టినరోజు వేడుకల్లో తోటి విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది.
Ganja Seized: డ్రగ్స్ ముఠాల ఆటకట్టిస్తున్నారు పోలీసులు. సినిమాటిక్ రేంజ్లో రాష్ట్రవ్యాప్తంగా మెరుపుదాడులు చేశారు. కొన్ని గంటల్లోనే ఏకంగా 500 కిలోల గంజాయి, పెద్ద ఎత్తున్న ఇతర మాదకద్రవ్యాలు పట్టుకున్నారు పోలీసులు. ఈగల్ టీమ్… జీఆర్పీ.. ఆర్పీఎఫ్.. ఎక్సైజ్.. లా అండ్ ఆర్డర్.. ఇలా అన్ని విభాగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. మాదకద్రవ్యాల రవాణా ముఠాల తాటతీశాయి. గంజాయి, డ్రగ్స్ రవాణా ముఠాలు రెచ్చిపోతున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నా.. పైఎత్తులు వేస్తూ రకరకాల మార్గాల్లో రవాణా…
హైదరాబాద్ శివారులోని చేవెళ్లలో హనీట్రాప్ ఘటన సంచలనంగా మారింది. యోగా గురువును బలవంతంగా వలలో వేసి, పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసిన గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు.
బోయినపల్లి మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో ఒక్కొక్కటిగా కీలక అంశాలు బయటపడుతున్నాయి. స్కూల్ యజమాని మలేలా జయప్రకాశ్ గౌడ్ దాదాపు 10 నెలలుగా అల్ప్రాజొలామ్ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
హైదరాబాద్ బోయినపల్లి మేధా స్కూల్లో వెలుగులోకి వచ్చిన డ్రగ్ తయారీ కేసు సంచలనంగా మారింది. ఈగిల్ టీమ్ నిర్వహించిన సోదాల్లో స్కూల్ లోపలే అల్ప్రాజొలామ్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసిన విషయం బయటపడింది.
సికింద్రాబాద్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. బోయిన్పల్లి పరిధిలోని ఒక స్కూల్ లోపలే పెద్ద ఎత్తున మత్తుమందు తయారీ జరుగుతుందని గూఢచారి సమాచారంపై ఈగల్ టీం దాడి చేసింది.
కరీంనగర్ జిల్లాలో క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు ఎగనామం చేసిన ముఠాపై పోలీసులు నిఘా కుదిపారు. “మూడింతల లాభాలు వస్తాయి” అంటూ ప్రజలను నమ్మబలికిన ఈ గ్యాంగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు షాకింగ్ విషయాలను బయటపెట్టారు.