టాలీవుడ్ ను వెంటాడుతున్న పైరసీ వెబ్సైట్ ఐ బొమ్మకు అడ్డుకట్ట వేశారు తెలంగాణ పోలీసులు. ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసి బెండు తీశారు పోలీసులు. పైరసీ ముఠా నుండి ఇండస్ట్రీని కాపాడిన హైదరాబాద్ సీపీ సజ్జనార్ ను టాలీవుడ్ ప్రముఖులు ప్రముఖులు చిరంజీవి, నాగార్జునలతో పాటు దర్శక దిగ్గజం రాజమౌళి, నిర్మాతలు దిల్‌రాజు, సురేష్ బాబు కలిసి కృతఙ్ఞతలు తెలిపారు. . అనంతర మీడియా సమావేశంలో SS రాజమౌళి కీలక వ్యాఖ్యలు చేశారు.…
హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్‌తో టాలీవుడ్ సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జునలతో పాటు దర్శక దిగ్గజం రాజమౌళి, నిర్మాతలు దిల్‌రాజు, సురేష్ బాబు భేటీ అయ్యారు. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ ను పట్టి పీడిస్తున్న పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని రెండు రోజుల క్రితం హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు. రవి నుండి కీలక సమాచారాన్ని సేకరించి మరికొన్ని పైరసీ వెబ్‌సైట్స్ కు అడ్డుకట్ట వేశారు పోలీసులు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్…
డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. అమాయకులు ఈ ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో వాహనంతో ఢీకొట్టి ఈడ్చుకుపోతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కంటైనర్ డ్రైవర్ బైకును ఢీకొట్టి 3 కి.మీలు లాక్కెళ్లాడు. మానవత్సం మరిచి వాహనాన్ని ఆపకుండా 3 కి.మీ. ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకెళ్లింది కంటెయినర్. కంటైనర్ ముందు భాగంలో బైక్ ఇరుక్కుపోయింది. మావల బైపాస్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. తలమడుగు మండలం దహేగాం…
Betting Apps : ఆన్లైన్ బెట్టింగ్, మద్యం వ్యసనాలతో అప్పులపాలై డబ్బు కోసం హత్యకు దిగిన ఇంజినీరింగ్ విద్యార్థి శివ మాధవ రెడ్డి (23)ని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఖమ్మం జిల్లాకు చెందిన దేవేందర్ రెడ్డి, నిహారిక (21) దంపతులు వెంకటేశ్వరనగర్‌లో నివాసముంటున్నారు. ఈ నెల 12న డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరుకున్న భర్త దేవేందర్ రెడ్డి, బాత్రూమ్లో నిహారిక పడి ఉండటం గమనించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు…
Hyderabad: శ్రీశైలం హైవే రెడ్ లైట్ ఏరియాగా మారుతోంది? హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిజ్రాల ఆగడాలు స్థానికులు, ప్రయాణికులను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రహదారిపై అర్ధనగ్నంగా నిలబడి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. హిజ్రాలు వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి.
హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్టలో దారుణ హత్య చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్ద రౌడీ షీటర్ రోషన్ సింగ్ (25)ను మరో రౌడీషీటర్ బాలశౌ రెడ్డి, అతని అనుచరులు ఆదిల్, మహమ్మద్‌లు కలిసి కత్తులతో దారుణంగా నరికి హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు బులెట్ బైక్‌పై అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు…
Poker Game In Excise PS: మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ఎక్సైజ్ స్టేషన్లో పేకాట ఆడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఇలా పేకాట ఆడటం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
Pocso Case : హైదరాబాద్ లో దారుణం జరిగింది. బోయిన్ పల్లిలో డ్యాన్స్ మాస్టర్ జ్ఞానేశ్వర్ సుబ్బు డ్యాన్స్ స్టూడియో నిర్వహిస్తున్నాడు. గత రెండు నెలలుగా అతని వద్ద డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన నాలుగేళ్ల చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎవరూ లేని టైమ్ లో ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. డ్యాన్స్ నేర్చుకునేందుకు వచ్చిన అమ్మాయిపై ఇలా ప్రవర్తించడంతో ఆమె చాలా భయపడిపోయింది. కొన్ని రోజులుగా డ్యాన్స్ స్కూల్ కు వెళ్లను అంటూ మారాం చేసింది. దీంతో…
Kidnap Case : హైదరాబాద్ నగరాన్ని షాక్‌కు గురి చేసిన అంబర్పేట్ రియల్టర్ కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. అక్టోబర్ 29న అంబర్పేట్ డీడీ కాలనీలో జరిగిన ఈ ఘటనలో రియల్టర్ మంత్రి శ్యామ్‌ను కిడ్నాప్ చేసిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగించి, ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి నేతృత్వంలోని పోలీసు బృందం పెద్ద ఎత్తున ఆధారాలు సేకరించింది. దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, మంత్రి శ్యామ్ కిడ్నాప్ వెనుక అతని మొదటి భార్య మాధవీలతే ప్రధాన…
DGP Shivadhar Reddy: 2016లో భరోసా సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.. ఈరోజు శంషాబాద్ లో 33వ భరోసా సెంటర్ ప్రారంభం జరిగిందని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు.. మహిళలు, పిల్లలపై హింసలు జరిగితే వారికి న్యాయం చేయడానికి భరోసా సెంటర్ లు ఉన్నాయన్నారు.. తాజాగా శంషాబాద్‌లో భారోసా సెంటర్‌ను ప్రారంభించిన డీజీపీ.. ఈ సందర్భంగా ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లాలు, 6 కమిషనరేట్ లలో భరోసా సెంటర్ లు ఉన్నాయని తెలిపారు.. భరోసా సెంటర్ ల…