Rave Party : హైదరాబాద్ శివారులో మరో రేవ్ పార్టీ కలకలం
- హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ కలకలం
- మహేశ్వరంలోని ఓ రిసార్ట్స్‌లో రేవ్ పార్టీ
- కె. చంద్రారెడ్డి రిసార్ట్స్‌పై SOT పోలీసుల దాడులు
- గుంటూరుకు చెందిన ఫర్టిలైజర్ కంపెనీ డీలర్ ఇస్తున్న రేవ్ పార్టీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rave Party : హైదరాబాద్ నగర శివారులో మళ్లీ రేవ్ పార్టీ కలకలం రేగింది. మాదకద్రవ్యాలు, మద్యం, క్యాసినో కాయిన్స్‌తో సాగే ఈ రాత్రి పార్టీలకు మరోసారి తెరలేపిన ఘటన ఇది. రాచకొండ పరిధిలోని మహేశ్వరం మండలం చెర్రాపల్లి సమీపంలోని కె. చంద్రారెడ్డి రిసార్ట్స్‌లో ఈ రేవ్ పార్టీ జరిగింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా SOT పోలీసులు రాత్రి ఆలస్యంగా దాడులు నిర్వహించి, రిసార్ట్స్‌లో జరిగిన అశ్లీల విందును అడ్డుకున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ పార్టీని గుంటూరుకు చెందిన ఫర్టిలైజర్ కంపెనీ డీలర్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన కంపెనీకి చెందిన ఇతర డీలర్లను, వ్యాపార భాగస్వాములను కలిపి “బిజినెస్ గ్యాదరింగ్” పేరుతో ఈ రేవ్ పార్టీని నిర్వహించినట్లు తెలుస్తోంది. రాత్రంతా సాగిన ఈ పార్టీలో ఏడుగురు మహిళా డాన్సర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని పోలీసులు తెలిపారు. ఈ మహిళలు హైదరాబాద్, బెంగళూరుకు చెందినవారని సమాచారం. వారితో పాటు పలువురు వ్యాపారవేత్తలు, యువకులు కూడా పార్టీలో పాల్గొన్నారు.
Also Read
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
Group 2 : గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త.. శిల్పకళావేదికలో నియామక పత్రాల కార్యక్రమం
దాడుల సందర్భంగా పోలీసులు పెద్ద మొత్తంలో మద్యం సీసాలు, క్యాసినో కాయిన్స్, సౌండ్ సిస్టమ్, పార్టీ లైటింగ్ సామగ్రిలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు.. పార్టీలో పాల్గొన్న వారిని విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీ నిర్వాహకుడు అయిన ఫర్టిలైజర్ డీలర్‌ను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై సంబంధిత ఎక్సైజ్, మాదకద్రవ్య నియంత్రణ విభాగాలు కూడా సమాచారం సేకరిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రేవ్ పార్టీలు విస్తృతంగా పెరుగుతున్నాయి. ప్రత్యేకించి శివారు ప్రాంతాల్లోని రిసార్ట్స్, ఫార్మ్ హౌస్‌లను ఈ తరహా పార్టీలకు వేదికగా వాడుకుంటున్నారు. పోలీసులు ఇలాంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
KTR : ఈ ఫేక్ ఓటర్లలో మైనర్లు కూడా.. కీలక విషయాలు వెల్లడించిన కేటీఆర్
తాజావార్తలు
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?